back

కొణిదెల నిహారిక కు వరుడు కావలెను



Share via:

మెగా బ్రదర్ నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో తన కూతురు నిహారిక పెళ్లి కబుర్లు చెప్పుకొచ్చారు. తనకు పెళ్లి విషయంలో నిహారికకు రెండు సంవత్సరాలు టైమ్ ఇచ్చామని, ఆ సమయం 2018 తో అయిపోయిందని, ఇక పెళ్లి కోసం వరుడు వెతుకులాట మొదలైందని చెప్పేశారు. నిహారికకు నటించడం అంటే ఇష్టమని, ఇంట్లోవాళ్ళంతా కలిసి చర్చింకున్నప్పుడు నిహారిక నటిస్తానని గట్టిగా చెప్పిందని.. అందుకే తన కోరిక తీర్చడానికి, నటించేందుకు ఒప్పుకున్నామని నాగబాబు అన్నారు. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లు చేస్తుందని చెప్పారు.


వరుడు కావలెను అని ప్రకటించిన నాగబాబు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకి కులం పట్టింపులు పెద్దగా లేవని , దొరికితే మా కాపు కులంలో లేకపోతే ఎ కులం అయినా మంచి అబ్బాయి అయితే చాలని పెళ్లి చేయడానికి సిద్ధం అని నాగబాబు అన్నారు. మరి ఎంత మంది అబ్బాయిలు ఈ మెగా ప్రిన్సెస్ కోసం క్యూ కడతారో ..

Tags : Niharika, Nagababu

Write a comment ...
Post comment
Cancel