back

కమెడియన్ బాలకృష్ణ అంటూ మళ్ళి నాగబాబు ….



Share via:

తనకు బాలయ్య ఎవరో తెలియదంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ గురించి అడిగితే.. ఒకప్పటి సీనియర్ నటుడు బాలయ్య గురించి ప్రస్తావించి సెటైర్లు వేశాడు నాగబాబు. ఐతే ఈ వ్యాఖ్యల్ని తాను వెనక్కి తీసుకుంటున్నానంటూ నాగబాబు తాజాగా ఒక వీడియోతో మళ్లీ జనాల ముందుకు వచ్చారు.

వీడియో మొదట్లో నాగబాబు తన వ్యాఖ్యల వాళ్ళ బాధపడిన వాళ్ళకి సారీ చెప్పడంతో . అంతా ఒకలా అనుకున్నారు. కాని తను మాట్లాడుతున్నది పాత కాలం నాటి హాస్య నటుడు బాలకృష్ణ గురించి అని తెలిసాక అందరు అవాకయ్యారు. ఆ వీడియో లో ఏముందంటే ..


“బాలకృష్ణ తెలియదన్న తన వ్యాఖ్యలకు కొంతమంది బాధ పడ్డారని తన మిత్రుల ద్వారా తర్వాత తెలిసిందని.. ఇది తప్పు కదా అని తనతో అన్నారని.. తన వ్యాఖ్యలు తప్పే అని నాగబాబు అన్నాడు. బాలయ్య తెలియకపోవడం ఏంటి.. ఆయన పెద్ద హాస్య నటుడు కదా అంటూ తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు. ఆయన అంత కామెడీ చేసేవాళ్లు అరుదుగా ఉంటారని.. ఆంగికాభినయాల కానీ.. పెర్ఫామెన్స్ కానీ చాలా బాగుంటుందని.. ఆయన కడుపుబ్బ నవ్విస్తారని.. నందమూరి తారక రామారావుతో కూడా కలిసి నటించిన గ్రేట్ కమెడియన్ బాలకృష్ణ అని చెబుతూ.. అలాంటి నటుడిని మరిచిపోయాననడం తన మిస్టేకే అని చెప్పాడు నాగబాబు. చివరగా.. ఒకప్పటి కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫొటో తీసి.. ఈయనే తాను చెప్పిన గ్రేట్ కమెడియన్ అన్నాడు నాగబాబు”.

ఇప్పటికే మొన్నటి వ్యాఖ్యలతో నాగబాబు పైన యుద్ధం ప్రకటించిన బాలయ్య ఫాన్స్, ఇక ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags : Nagababu, Balakrishna

Write a comment ...
Post comment
Cancel