back

నాగబాబు ఇంటర్వ్యూ లోని కొన్ని ముఖ్యాంశాలు.....Share via:

ఒక యుట్యూబ్ ఛానల్ కి నాగబాబు కొణిదెల నాగబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకోని సంచలనంగా మారింది. క్రైస్తవ ప్రచారకర్త మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చెప్పటం దుమారానికి తెరలేపింది. ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు మరచిపోకముందే.. మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపెలా ఉన్నాయి. మరి నాగబాబు ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం.....

బాలక్రిష్ణ గురించి...
“ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును బాలయ్య బాబు గురించి అడగగా.. ఆయన వెంటనే బాలయ్య బాబు ఎవరు? ఆ పేరు ఎప్పుడూ వినలేదే! అనేశారు. ఆ తర్వాత వెంటనే సీనియర్ నటుడు బాలయ్య అయితే తెలుసు తప్ప నందమూరి బాలకృష్ణ తనకు తెలియదని చెప్పారు.”


ఇలా మాట్లాడటం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోందని తెలుస్తోంది. దీంతో బాలయ్య బాబు మీకు తెలియదా? అంటూ ఆయన అభిమానులు మెగా బ్రదర్‌ పై మండి పడుతున్నారు. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ఓ కారణం ఉందని అంటున్నారు కొందరు. గతంలో ఓ సారి బాలకృష్ణ.. ఓ సందర్భంలో తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పారు. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనే అయింది. దీంతో దానికి సెటైర్ వేయాలనే ఉద్దేశ్యంతోనే నాగబాబు ఇలా అని ఉంటాడని చెప్పుకుంటున్నారు జనం.

మహేష్ బాబు గురించి...
“మహేష్ గురించి ఒక్క మాట ఏంటి ఎంత సేపైనా మాట్లాడొచ్చు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సమానమైన క్రేజ్ ఉన్న వ్యక్తి. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తి. తండ్రి వారసత్వంకు తగ్గట్లుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న వ్యక్తి. తన భార్య వయస్సు వారు మహేష్ ను తమ్ముడిలా భావిస్తారు - ఇక ఈ తరం అమ్మాయిలు అతడిని డ్రీమ్ బాయ్ గా చూస్తారు. ప్రిన్స్ అనే పదానికి అతడు పూర్తిగా అర్హుడు అన్నాడు.”


నాగబాబు కామెంట్స్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహేష్ బాబు గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెబుతూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

కొడుకు వరుణ్ తేజ్ కెరీర్ గురించి...
“వరుణ్ ఎంట్రీ కోసం పెద్ద బ్యానర్ లతో చర్చలు చేశాం. అశ్వినీదత్ మొదట వరుణ్ ను పరిచయం చేయాలని అనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆయనకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత కూడా పలువురు పెద్ద నిర్మాతలను సంప్రదించినా కూడా కుదరలేదు. వరుణ్ మొదటి సినిమాకు క్రిష్ దర్శకత్వం చేయాల్సి ఉంది. కాని అది సాధ్యం కాలేదు. అలా వరుణ్ తేజ్ ఎంట్రీ చివరకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్ మదు - బుజ్జిల నిర్మాణంలో ఇచ్చాడు.


ప్రస్తుతం వరుణ్ బాగానే సంపాదిస్తున్నాడు. అతడి సంపాదన ముందు నాది తక్కువే. అయినా కూడా ఇప్పటికి పాకెట్ మనీ నానుండే తీసుకుంటాడు. ఇక కథల ఎంపిక విషయంలో వరుణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అతడి సినిమాల విషయంలో నా ఇన్వాల్వ్ మెంట్ అస్సలు ఉండదు. కథ ఫైనల్ అయిన తర్వాత ఒక సారి నాకు వినిపిస్తాడు. అంతకు మించి నాకు వరుణ్ సినిమాలో ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ ఉండదు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.”

Tags : Nagababu Interview, Balakrishna, Mahesh Babu

Write a comment ...
Post comment
Cancel