back

అన్నయ్య వల్లనే ఓపిక పట్టినాము , ఇంకో ఆఖరి కౌంటర్ ఉంది - నాగబాబు



Share via:

కొణిదెల నాగబాబు ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలలో నందమూరి బాలక్రిష్ణ రకరకాల సందర్బాలలో చేసిన వ్యాఖ్యలకు తనదైన శైళిలో రోజుకొక కౌంటర్ ఇస్తున్న నాగబాబు నిన్నటి రోజు తన కౌంటర్ గా ఒక షార్ట్ ఫిలిం పోస్ట్ చేసారు. ఒక ఆడియో వేడుకలో బాలక్రిష్ణ మాట్లాడుతూ ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అనే వ్యాఖ్యలకు ఈ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. అయితే ఈ రోజు ఇంకో వీడియో తో మనముందుకు వచ్చిన నాగబాబు,


“ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తను అయనను డైరెక్ట్ గా అనలేదని.. వల్లూరి బాలకృష్ణ పేరు చెప్తే వారిని అన్నానని అనుకున్నారు..  మేలుజాతి పశువుల ఫోటోలు పోస్ట్ చేస్తే వారినే అనుకుంటున్నారు.. ‘ఎర్రోడి వీరగాధ’ షార్ట్ ఫిలిం కూడా వారిగురించే అనుకుంటున్నారు .. ఇలా ప్రతి ఒక్కదానికి వారినే అన్నానని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఉంది వ్యవహారం మరి మీరు భుజాలు తడుముకుంటున్నారంటే నిజాలు లేవా?” అని ప్రశ్నించాడు.  

”ఎన్ని సార్లు మమ్మల్ని.. మా ఫ్యామిలీని  డైరెక్ట్ గా అన్నా పెద్దగా స్పందించని మీడియా ఇప్పుడు నేను వారినే డైరెక్ట్ గా ఏమీ అనకున్నా 24 గంటలూ చర్చలు పెడుతోందని.. అదేం న్యాయం తమను అవమానించిన ప్రతి సారి సమాధానం చెప్పాలని ఆవేశపడేవాళ్ళమని, కాకపోతే ధర్మరాజు లాగా అన్నయ్య శాంతం శాంతం అని తమను ఆపేవారు.”

ఇంకా ఆఖరి కౌంటర్ ఉందని.. దాని కోసం అందరిని వేచి చూడమని కోరాడు. ఇంకో కౌంటర్ తో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెడతానని అన్నాడు.

< ahref="http://www.only4megafans.com/news/nagababu-counter-no-6"> నాగబాబు కౌంటర్ నెం 6 - ఎర్రోడి వీరగాథ

Tags : Nagababu, Balakrishna, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel