back

నాగబాబు కౌంటర్ నెం.4 - నెత్తిన పెట్టుకోమని మేమడగలేదే..!Share via:

గత మూడు రోజులుగా తన యుట్యుబ్ చానల్ ద్వారా బాలక్రిష్ణ ఇంతకముందు తమ కుటుంబం పైన చేసిన వ్యాక్యలకు కౌంటర్ ఇస్తున్న నాగబాబు, నిన్న తన 4 వ కౌంటర్ వదిలాడు. హిందూపురం ఎం.ఎల్.ఎ అయిన బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాల సందర్బంగా చేసిన వ్యాక్యలకు ఈ కౌంటర్ ఇచ్చాడు.


ఎన్టీవీలో వచ్చిన న్యూస్ ఇమేజ్ ని చూపిస్తూ “ మీరు లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలిచారా అన్నప్పుడు లేదండి పిలువలేదు అంటూ సింపుల్ గా చెప్తే సరిపోయేది. కాని మీరు మాకున్న గ్లామర్ చాలు ఇంకా ఎవడిని నెత్తిన కూర్చోబెట్టుకోం అంటూ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు ఏమైనా మీకు ఫోన్ చేసి నన్ను నెత్తిన పెట్టుకోమని అడిగారా - లేదంటే మా అభిమానులు ఎవరైనా మిమ్ములను నెత్తిన ఎత్తుకోమని కోరార. మమ్ములెవరు నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ గ్లామర్ ఉంటే మీరే ఉంచుకోండి - అంతే కాని చిరంజీవి గారిని పిలిచారా అన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏంటని” నాగబాబు ప్రశ్నించారు.

చిరంజీవి గారికి , పవన్ కళ్యాణ్ కి ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదు, అందుకే మేము కూడా సైలెంట్ గ ఉన్నాం. ఇక నేను ఇప్పుడు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను అందుకే ఈ విధంగా మీకు చెప్తున్నాను. ఇది కొనసాగుతుంది అంటూ ఈ రోజు పోద్ధన 9 గంటలకు ఇంకో వీడియో రిలీజ్ చేసారు నాగబాబు.

బాలకృష్ణకి వరుస కౌంటర్ల తో నాగబాబు ...

Tags : Balakrishna, Nagababu Comments

Write a comment ...
Post comment
Cancel