back

మళ్ళి మొదలెట్టిన నాగబాబు - బాబు బంగారం నారా లోకేష్



Share via:

జనవరి మొదటి వారంలో తన యుట్యూబ్ చానల్ ద్వారా ఎప్పటి నుంచో నందమూరి బాలకృష్ణ మెగా ఫ్యామిలీ పైన చేసిన వ్యాక్యలకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పుకొచ్చిన నాగబాబు, ఆ తరువాత ఒక ఘాటు వార్నింగ్ తో అది ఆపేసాడు. ఆపేశానన్నాడుగానీ మళ్ళీ మొదలెట్టాడు నాగబాబు, ఈసారి కొంచెం కొత్తగా 'మై ఛానెల్ నా ఇష్టం' అంటూ నెటిజన్ల ముందుకొచ్చాడు. డైరెక్టుగా ఈసారి నందమూరి బాలకృష్ణ మీదకు వెళ్ళలేదు నాగబాబు. కానీ, బాలకృష్ణ మేనల్లుడు ఆంధ్ర సి.ఎం. కొడుకు, మంత్రి నారా లోకేష్ మీద సెటైర్లు వేశాడు.


ఇందులో తాను ఫన్ జనరేట్ చేస్తాను తప్ప ఎవరిని ఇది ఇబ్బంది పెట్టడానికి కాదన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన నాగబాబు తరువాత ఎవరెవరిని టార్గెట్ చేస్తాడనేది చూడాలి. ఇక నాగబాబు ఎం చెప్పారంటే ..”తాను చిన్నప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ పాట వినేవాడిని ఎందుకంటే పిల్లలు అస్సలు అబద్దాలు ఆడరు. పిల్లలకు అబద్దాలు అనేవి తెలియదు. ఈ పిల్లాడు ఏం మాట్లాడాడో ఒక సారి చూడండి అంటూ.. 'మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎలాంటి అవినీతి బంధుప్రీతి మత పిచ్చి కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగు దేశం పార్టీయే' అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను చూపించాడు.

చూశారు కదా - ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడో - నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దమ్ము తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎవ్వరు లేరు లోకేష్ బాబు గారు - మీరు గ్రేట్ అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

నాగబాబు ఆఖరి కౌంటర్ - నోరు అదుపులో పెట్టుకోండి

Tags : Nagababu, Nara Lokesh

Write a comment ...
Post comment
Cancel