back

బాలక్రిష్ణని మళ్ళి గెలికిన నాగబాబు ..?



Share via:

గత కొంత కాలంగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ ఐపోయాడు. ఈ మధ్య ఒక యుట్యుబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తెలీదంటూ దుమారం రేపిన నాగబాబు, తరువాత తనకి పాతకాలం కమెడియన్ బాలక్రిష్ణ మాత్రం తెలుసంటూ మరో సారి బాలక్రిష్ణ అభిమానులను గెలికాడు. ఈ సందర్బం లో బాలక్రిష్ణ ఫాన్స్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన సినిమాని దెబ్బ తీస్తాం అని చెప్పడం దానిని నాగాబాబే కాక వరుణ్ తేజ్ కూడా లెక్కచేయలేదు. అయితే వరుణ్ తన తండ్రి ఏ సందర్బంలో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది చెప్పి, అందులో ఎటువంటి తప్పు లేదని చెప్పుకొచ్చాడు. అలాగే బాలక్రిష్ణ కూడా మొన్న ఎన్టీఆర్ ఆడియో వేడుకలో ఇండైరేక్ట్ గా వీటికి కౌంటర్ ఇచ్చాడు.


ఇంక ఈ వివాదం ముగుస్తుంది అనుకుంటున్న తరుణంలో నాగబాబు మరోసారి బాలక్రిష్ణని గెలికాడు. ఈ రోజు తన ఫేస్బుక్ పేజీలో నాగబాబు ఒక చిన్న పిల్లోడు ‘సారే జహాసే అచ్చా’ పాటను పడుతున్న వీడియో ని పోస్ట్ చేసి ..ఆ పిల్లవాడిని చూసి అందరు నేర్చుకోవాలి అనేవిధంగా పోస్ట్ పెట్టాడు. ఇది ఒక రకంగా బాలకృష్ణకి కి సటైర్ అంటున్నారు అభిమానులు. ఎందుకంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలక్రిష్ణ ‘సారే జహాసే అచ్చా’ పాటను పాడబోయి తడబడిన విధానం, దానిని గేలి చేస్తూ అందరు ‘బుల్ బుల్ బాలయ్య’ అంటూ సోషల్ మీడియా లో రచ్చ చేయడం తెలిసిందే. ఈ పాట ఎలా పాడాలో బాలక్రిష్ణ లాంటి వాళ్ళు తెలుసుకోవాలనే విధంగా ఉంది నాగబాబు పోస్ట్.

మరి ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags : Naga Babu, Balakrishna

Write a comment ...
Post comment
Cancel