back

మెగా స్టార్ తో పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్..



Share via:

చిరంజీవి తనయుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం `సైరా నరసింహ రెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో అక్టోబ‌ర్ రెండో తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ క‌లిశారు.

చిరంజీవిని కలిసి ఆయనతో మాట్లాడిన విష‌యాన్ని నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ``సైరా` న‌ర్సింహారెడ్డి (చిరంజీవిగారితో)తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు, నేను స‌మావేశ‌మ‌య్యాం. చాలా విష‌యాలు మాట్లాడుకున్నాం. ఆయ‌న జీవిత ప‌య‌నం మాకెంతో స్ఫూర్తి క‌లిగించింది. ఆయ‌న‌కు గొప్ప విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్నాను. ఇలాంటి మ‌రెన్నో స‌మావేశాల్లో ఆయ‌న‌తో క‌లిసి పాల్గొనాల‌ని కోరుకుంటున్నా` అంటూ నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు. చిరంజీవి, ప‌వ‌న్‌ల‌తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు.

Tags : Chiranjeevi, Pawankalyan, Nadendla Manohar, Syeraa

Write a comment ...
Post comment
Cancel
raju
2019-07-24 07:25:43

photosuperthakumegastar


Reply
Post comment
Cancel