back

జనసేన లోకి నాదెండ్ల మనోహర్...



Share via:

కాంగ్రెస్కు నాదెండ్ల మనోహర్ రాజీనామా.. జనసేనలో చేరబోతున్నారా? కాంగ్రెస్కు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గుడ్ బై చెప్పారు. గురువారం పార్టీకి మనోహర్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్ తిరుపతి లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆయన దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి మనోహర్ తిరుమల వెంకన్న ని కూడా దర్శించుకున్నారు. జనసేనలో చేరికపై ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటనచేయబోతున్నట్లు సమాచారం. 

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్.. రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు.

కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్.. కొద్దిరోజులుగా అనుచరులతో సమావేశమవుతున్న ఆయన.. కాంగ్రెస్కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న జనసేనకి ఇది బాగా ప్లస్ అయినట్లే...

Tags : Nadendla Manohar, Janasena Party, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel