back

అక్కడ అదరగొడుతున్న నా పేరు సూర్య



Share via:

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ ఏడాది మే లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. అందుకే ఈ సారి బన్నీ కూడా తన తర్వాతి చిత్రం పై ఆచితూచి అడుగేస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే...

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలోని కొన్ని ప్రముఖ నగరాల్లాంటి ఢిల్లీ, ముంబై, సూరత్, ఇండోర్ లో హిందీ డబ్బింగ్ తో విడుదలైంది. అయితే అక్కడ ఈ చిత్రానికి అద్బుత స్పందన రావడంతో ఎగ్జిబిటర్లు మరికొన్ని నగరాల్లో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే సరైనోడు, దువ్వాడ జగన్నాధం సినిమాలు హిందీ డబ్బింగ్ తో యుట్యూబ్ లో విడుదలై ఎన్నో రికార్డులను నెలకొల్పిన విషయం విదితమే. ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాని జీ సినిమా ఛానల్ అక్టోబర్లో ప్రసారం చెయ్యబోతుంది.

Tags : Naa Peru Surya Naa Illu India, Stylish Star, Allu Arjun, Surya The Soldier

Write a comment ...
Post comment
Cancel