back

నా పేరు సూర్య ప్రీ రిలీజ్ 15న ...వేదిక ?



Share via:

మొన్న అజ్ఞాతవాసి సినిమా విషయం లో జరిగిన విపత్కర పరస్థితి నుంచి బయటపడి, ఇప్పుడు రంగస్థలం సినిమా హిట్ తో మల్లి తమ కాలర్లు ఎగురేస్తున్న మెగా ఫాన్స్, మళ్ళీ త్వరలోనే మరో పండగకి సిద్దం కానున్నారు.

ఈ సారి అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' రూపంలో... మెగా ఫ్యామిలీ వారి మరో సినిమా మే 4 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంకా ఇప్పుడు రంగస్థలం మేనియా కొనసాగుతూనే వుంది, ఈ నెల మొత్తం రంగస్థలం హవాలో మునిగి తేలుతారు మెగా ఫాన్స్... ఇక రంగస్థలం ప్రస్థానం ముగియగానే మల్లి వెంటనే వచ్చే నెల మే లో నా పేరు సూర్య మాయలో పడిపోవడం ఖాయం.

ఇక నాపేరు సూర్య సినిమా కి సంభంధించి కొత్త వార్త అనౌన్స్ అయింది, ఈ నెల 15 న ప్రీ రిలీజ్ జరుపుకోనుంది అయితే వేదిక ఎక్కడ అన్నది ఇంకా కన్ఫార్మ్ కానట్టు సమాచారం. మొదట వైజాగ్ అనుకున్నారు కాని రంగస్థలం ప్రీ రిలీజ్ అక్కడే జరిగింది కాబట్టి ఇంకో చోట పెడితే బాగుంట్టుంది అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే రాయలసీమ ప్రాంతంలో ఈ ఈవెంట్ పెట్టె అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది... అక్కడ సినిమా ఫంక్షన్స్ జరిగి చాల కాలం అయిన దృశ్య ఆ ప్రాంతాన్ని ఎంచుకోనున్నారు అని వినికిడి.

అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలు...

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Naa Peru Surya Naa Illu India, Naa Peru Surya Pre Release Event Date, Naa Peru Surya Pre Release Location, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel