back

జనసైనికులు ఖచ్చితంగా చదవాల్సిన సందేశం...Share via:

జనసైనికులారా,
జనంలోకి జనసేనని తీసుకొని వెళ్తున్న నిజమైన కార్యకర్తలారా,
వందనం!

ఆంధ్రప్రదేశ్లో అవినీతి పాలన అంతమెందించడానికి
బుణాంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణాంధ్రాగా తీర్చిదిద్దడానికి
జనామోదంతో
జనగళంతో
జనసేన #గాజుగ్లాస్ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నది.
మరి మన కర్తవ్యం?

మీ పట్టణాలలో, నియోజకవర్గాలలో, మండలాలో, గ్రామాలలో లేదా వార్డులో, పోలింగ్ బూత్ వరకు పటిష్టంగా ఉందా?
వాటికి మీ వంతు సహాయ సహకారాలు అందించారా??
మీకు తెలుసా, ఈ త్రికోణ ఎన్నికలబరిలో ఒక్క వోట్ కూడా ఫలితాలు తారుమారు చెయ్యగలవు అని?
మీకు తెలుసా....

జనసేనలో మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనం మొదటి రోజు నుంచి ఉన్నాము.
జనసేన సిద్దాంతాలు మనం వంటపట్టించుకొన్నాము.
వాటిని తీసుకొని వెళ్ళవలిసిన బాద్యత మన మీదే ఉంది.
రండి
కదలి రండి
ఆలోచించండి.


సామెత:
ఇంట గెలిచి రచ్చ గెలవాలి - ముందు మీ గ్రామం లేదా వార్డ్ లో పని చెయ్యండి. ప్రజలతో మమేకం అవ్వండి. జనసేన తీసుకొని రాబోవు మార్పు గురించి చెప్పండి. ఆంధ్రా నూతనశక ఆవిష్కరణానికి అడుగులు వెయ్యండి.

వ్యాపార సూక్తి:
ఎంతటి వస్తువైనా సరైన వాణిజ్య ప్రకటణ లేనిదే రాణించదు - న్యూస్ చానెల్స్ ని ప్రజలు నమ్మడం మాని సోషల్ మీడియా దూసుకొని పోతున్న ఈ శకంలో జనసేన భావజాలాన్ని, చేస్తున్న ప్రజోపకార పనులని, మన మాన్యిఫెస్టోని అందరికీ అందుబాటులో ఉంచండి. గమనిక: మన నాయకుడే చెప్పారు - మనకి ఉన్న బలం సోషల మిడియా అని.


యుద్దగాధ:
యుద్ధ సన్నాహాల యందు అందరూ సైనికులే..
యుద్ధం అస్తమించే సమయానికి యోధులు మాత్రమే స్వైరవిహారం చేయుదురు.. సామాన్య సైనికులు నిస్తేజులుగా మిగులుదురు.
కావున మీరు ఉత్తి సైనికులుగా జనచరిత్రలో మిగిలిపోతారా? యోధులుగా జనులచే కీర్తింపబడతారా??

రాజనీతి:
ఎన్నికల ప్రక్రియలో ఎప్పుడైతే పోలింగ్ బూత్ ని శాసిస్తామో అప్పుడే విజయపతాకం ఎగురవేయగలం.
ఆంధ్రప్రదేశ్ లో 40000 (సుమారు నలబైవేల పోలింగ్ బూత్స్ కలవు) పోలింగ్ బూత్ లు కలవు. ఒక్కొక్క బూత్ కి ఇద్దరు ఏజెంట్స్ చెప్పున లెక్క వేసుకొన్న మనకి 80000 ఏజంట్స్ కావలెను.


మనకి కావలిసిన కార్యకర్తలు:
175 నియోజకవర్గాలు X 100 కార్యకర్తలు = 17500
13 జిల్లాలు X 100 కార్యకర్తలు = 1300
676 మండలాలు X 10 కార్యకర్తలు = 6760
18000 గ్రామాలు X 10 కార్యకర్తలు = 180000
40000 పోలింగ్ బూత్ X 2 ఏజంట్స్ = 80000

__________

మొత్తం జనసేన జనసైన్యం = 285560

__________

ఈ జనసైన్యం రమారమి ఒక అక్షౌహిణి కి సమానం.

అక్షౌహిణి = 21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు

జన అక్షౌహిణి = 175 నియోజకవర్గ రధములు + 13 జిల్లాల మరియు 676 మండలాల ఏనుగులు + 18000 గ్రామాల గుర్రాలు + 40000 పోలింగ్ ఏజంట్స్ కాలిబంట్లు

ఆంధ్ర మహాభారత కురుక్షేత్రంలో పాండవుల పక్షాన పాంచజన్యం పవనుడే పూరిస్తే ....
జనసేన అతిరధులు, మహారధులు, సమరధులు మరియు అర్ధరధులు అండగా

అన్నపుర్ణాంధ్రప్రదేష్ గా మలచడానికి
ఒక సామాన్యుడు తాగే టీ గాజు గ్లాస్ గుర్తుతో మన ముందుకు వస్తున్న ...
మన జనసేనకి ....
జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ!!


Tags : Janasena Party, Janasainiks, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel