back

ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా' - ఉపరాష్ట్రపతి



Share via:

సై రా నరసింహారెడ్డి చిత్రం పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దేశ భక్తిని పెంపొందించే సినిమాలు చాల తగ్గిపోయాయని సై రా నరసింహారెడ్డి ఆ కొరతని తీర్చేసింది అని చిరంజీవిని కొనియాడారు. వెంకయ్య నాయుడు తన నివాసం లో చిరంజీవి, కుటుంబ సభ్యులు, కామినేని శ్రీనివాస్ తో సై రా ని చూసినట్లు తెలుస్తుంది. సినిమాలో బ్రిటిష్ పాలకులు భారతీయుల పై చేసిన దౌర్జన్యాలను, పాలనా విధానాన్ని, స్వార్థాన్ని, అంతర్గత కలహాల్ని చక్కగా చూపించారని అన్నారు. నిర్మించినందుకు రామ్ చరణ్ ని, దర్శకత్వం వహించినందుకు సురేందర్ రెడ్డి ని ప్రశంసలతో ముంచెత్తారు వెంకయ్య నాయుడు.

ఈ చిత్రం పట్ల ఎంతో సంతోషం వ్యక్త పరచిన వెంకయ్య నాయుడు, చిరంజీవిని ఇంకా మంచి సిన్మాలు తీసి ప్రేక్షకుల్ని రంజింప చేయాల్సిందిగా సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవి గారు కూడా ఈ చిత్రం వెంకయ్య నాయుడు వీక్షించడం పట్ల సంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా చిరు రాష్ట్రపతి ని మరియు ప్రధాని నరేంద్ర మోడీ లను కలిసి సినిమా వీక్షించాల్సిందా కోరనున్నారు. వీరి వ్యాఖ్యలతో సై రా చిత్రానికి మైలేజ్ పెరిగిందని చెప్పాలి. అక్టోబర్ 2 న విడుదల అయిన సై రా విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది.

Tags : Syeraa, Chiranjeevi, Venkaiah Garu, Vice President of India

Write a comment ...
Post comment
Cancel