back

మెగాస్టార్ తో డ్యూయల్ రోల్ చేపిస్తున్న కొరటాల శివ ?



Share via:

ఒక సినిమా ఏదైనా ఫైనల్ అయ్యిందంటే దాని గురించి రకరకాల వార్తలు రావడం మామూలే.. కానీ సినిమా ఫైనల్ అయిన విషయం కూడా తెలికుండానే ఒక సినిమా సిని పరిశ్రమలో రకరకాల చర్చలకి తావిస్తుంది. అదే కొరటాల శివ, చిరంజీవిల సినిమా. ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. అంతేకాదండోయ్. చిరు పోషిస్తున్న రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చేసుకునే పాత్ర కాగా రెండవది మిలియనీర్ పాత్ర.

ఈ కథ ఎంత వరకు నిజమో తెలిదు కాని చిరంజీవి ఒక్కడు కనిపిస్తేనే ఆనందపడే అభిమానులకు ఇది మంచి వార్తే... అప్పుడెప్పుడో అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన చిరంజీవి మళ్ళి ఇనాళ్ళకు మాస్ పల్స్ బాగా తెలిసిన కొరటాల సినిమాలో రెండు పాత్రల్లో రెండు రకాల నటనతో అందరిని మెప్పిస్తాడని అభిమానులు అప్పుడే సంబర పడుతున్నారు. ఇక ఈ వార్తలన్నీ నిజం అవ్వాలని కోరుకుందాం.

Tags : Megastar Dual Role, Megastar Chiranjeevi - Koratala Siva Movie Updates

Write a comment ...
Post comment
Cancel