back

కొరటాల తరువాత త్రివిక్రమ్ తోనే చిరంజీవి సినిమా



Share via:

నిన్న జరిగిన వినయ విదేయ రామ వేడుక లో తన తరువాతి సినిమా గురించి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. చిరంజీవి మాటల్లో...

"మాటల మాంత్రికుడు, పవన్ కు అత్యంత ఆప్తుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఆల్రెడీ సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాకు నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. మా కాంబినేషన్ లో మంచి సినిమా వస్తోంది. ఇది ఇక్కడ చెప్పకూడదు. కానీ ఆగలేకపోయాను."


ఇలా ఆగలేక అసలు విషయం బయటపెట్టాడు చిరంజీవి. నిజానికి తన సినిమా వేడుకలకు మాత్రమే అటెండ్ అయ్యే త్రివిక్రమ్ ఈ సినిమా వేడుకకి రావడంతో చాలామంది చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ ను ఊహించారు. కానీ అనూహ్యంగా చిరంజీవి సినిమా ప్రకటించాడు. త్రివిక్రమ్ ను తనను కలిపిన ఘనత రామ్ చరణ్ దే అంటున్నాడు చిరు.

ప్రస్తుతం బన్నీకి ఓ కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే చిరంజీవితో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో సైరా సినిమాను ఆ తరువాత కొరటాల సినిమాను పూర్తిచేస్తాడు చిరంజీవి. తాజా ప్రకటనతో చిరంజీవి రాజకీయాలని పూర్తిగా వదిలేసినట్లే అనిపిస్తుంది. అందులో కేటిఆర్ తన స్పీచ్ లో రాంచరణ్ రాజకీయ భవిష్యతు గురించి మాట్లాడినప్పుడు కూడా , చిరు వాడి పని వాడు చేసుకొని అంటూ కేటిఆర్ తో అనడం అందరు విన్నారు.


Tags : chiru updates, megastar movie details

Write a comment ...
Post comment
Cancel