back

సంక్రాంతికి మొదలు కానున్న కొరటాల 'మెగా' సినిమా...



Share via:

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’...అనే సినిమా పేర్లు చూడగానే మనకు గుర్తొచ్చే పేరు కొరటాల శివ. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు నాలుగంటే నాలుగే. కానీ, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడంలో తనది అందె వేసిన చేయి అని ఆయన నిరూపించుకున్నారు. కొరటాల తీసిన ప్రతి సినిమా ఆ సినిమాలో నటించిన హీరోలను మరో ఎత్తు పైకి తీసికేల్లింది. మరి అటువంటి శివ ఇప్పుడు ఏకంగా శిఖరాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సినిమా నిర్మించనున్నాయి. ఇటీవల దర్శకుడు స్ర్కిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తి చేశారట..! క్లాప్‌ కొట్టడమే తరువాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం ఎటువంటి కథను సిద్ధం చేసుంటారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు చక్కటి సందేశాత్మక కథను కొరటాల సిద్ధం చేశారని, రైతులు వారి కష్టాలను బాక్గ్రౌండ్ గా తీసుకున్న ఈ సినిమా పేరు కూడా రైతుబందు నిర్మాణ సంస్థల నుంచి అందుతోన్న సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే... ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అప్పుడే స్టార్ట్ అవ్వనుంది.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel