back

మెగా హీరోస్ @ 2018Share via:

2018 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఈ సంవత్సరం మెగా హీరోలకు ఎలా ముగిసింది అనేది ఒకసారి చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి `ఖైదీనంబర్ 150` తర్వాత  చాలా గ్యాప్ తీసుకున్నారు. అందువల్ల ఆయన నటించిన సినిమా ఏదీ 2018లో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం `సైరా- నరసింహారెడ్డి` చిత్రీకరణలో ఉంది. ఇక 2019లో సైరా రిలీజ్ తో పాటు కొరటాల శివ సినిమా మొదులు కానుంది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` చిత్రం డిజాస్టర్ ఫలితం అందుకుంది. ఈ సినిమా నిరాశపరిచాక మరో సినిమా మాట ఎత్తకుండా పవన్ పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. మరి ఈ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య` చిత్రంతో డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాడు. తానొకటి తలిస్తే అన్నచందంగా అవ్వడంతో బన్ని చాలానే నిరాశపడ్డాడు. అయితే చాలా గ్యాప్ తరువాత ఈ రోజే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో అంటూ ఆఫీషియల్ గా అనౌన్సు చేసారు. వచ్చే సంవత్సరం మరో జులాయి చూడచ్చు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్

2018 వేసవిలో రంగస్థలం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్త వరవడికి తెరతీసాడు రాంచరణ్. 125 పైన షేర్ సాధించిన ఈ సినిమా మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది. ఇదే తరహాలోనే 2019 లో రామ్ చరణ్ సంక్రాంతి రిలీజ్ తో ఖాతా ఓపెన్ చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో జనవరి 11న చరణ్ నటించిన `వినయ విధేయ రామా` భారీ అంచనాల నడుమ విడుదల అవుతుంది . ఓపెనింగ్ బ్యాట్స్ మన్ జోరు బావుంటే.. టీమ్ అంతా ఊపేస్తుంది! అన్న చందంగా చరణ్ హిట్టింగ్ పైనే అభిమానుల అంచనాలు రెట్టించాయి. ఆరంభం బావుంటుందనే ఆశ. 

సాయి ధరం తేజ్

సుప్రీం హీరో సాయిధరమ్ కెరీర్ రెండు  డిజాస్టర్లతో డీలా పడిపోయింది. వినాయక్ దర్శకత్వంలోని ఇంటెలిజెంట్ - కరుణాకరణ్ దర్శకత్వం వహించిన `తేజ్.. ఐ లవ్ యు`  చిత్రాలు డిజాస్టర్లయ్యాయి. దీంతో సాయిధరమ్ తీవ్రంగా నిరాశపడ్డాడు. చాలా అలోచించి తీస్తున్న ‘చిత్రలహరి’ మీదనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి సాయి భవిష్యత్తు డిసైడ్ చేసేది 2019.

వరుణ్ తేజ్

 

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక హిట్టు - ఒక ఫ్లాపుతో ఓకే అనిపించాడు. ప్రథమార్థంలో వరుణ్ తేజ్ నటించిన `తొలి ప్రేమ` రిలీజై హిట్ కొట్టింది. ఏడాది ద్వితీయార్థం ముగింపులో రిలీజైన `అంతరిక్షం` నిరాశపరిచింది. టాలీవుడ్ లో ప్రయోగాల హీరోగా వరుణ్ తేజ్ కి గుర్తింపు అయితే దక్కింది. అన్న రాంచరణ్ తో పాటు తన సినిమా ‘F2’ తో సంక్రాంతి కి వస్తున్నాడు వరుణ్.

ఇతరులు

అల్లు శిరీష్ కి సినిమాలేవీ లేవు. ఓన్లీ `ఏబీసీడీ`సినిమా రిలీజ్ కి రెడీ అయింది. మరి ఈ సినిమా అయిన శిరీష్ కి కలిసి వస్తుందేమో చూడాలి.

నిహారిక నటించిన `హ్యాపీ వెడ్డింగ్` ఫ్లాప్ గా నిలవడం నిరాశపరిచింది. మళ్ళి తనకి పేరు వచ్చిన వెబ్ సిరీస్ తో బిజి అయింది అమ్మాయి.

ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా ‘విజేత’ మంచి కథ అయిన కూడా విజయం సాధించలేకపోయింది. మరి తన 2019లో తన సినిమాతో అయిన హిట్ కోడతాడెమో చూడాలి.

Tags : Megaheroes, 2018 films

Write a comment ...
Post comment
Cancel