back

నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ పైన అంత గొడవెందుకు..!



Share via:

నాని మొన్నతన పుట్టిన రోజు సందర్బంగా తన తరువాతి సినిమా టైటిల్ గ “గ్యాంగ్ లీడర్” అని అనౌన్సు చేసాడో, అప్పటినుంచి నాని పైన రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు.

గ్యాంగ్ లీడర్ అనగానే తెలుగు నాట గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి. విజయబాపినీడు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి , విజయశాంతి జంటగా వచ్చిన ఈ సినిమా చిరంజీవి ని దేశం లోనే పెద్ద స్టార్స్ లో ఒకడిని చేసింది. అటువంటి సినిమా టైటిల్ ని రాంచరణ్ వాడుకోవాలి కాని నాని వాడడం ఏంటి అనేది మెగా అభిమానుల ఆగ్రహం కి కారణం.

కొందరు అభిమానులు మాత్రం, ఈ టైటిల్ ని గీత ఆర్ట్స్ కాని కొణిదెల ప్రొడక్షన్స్ కాని రిజిస్టర్ చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని మెగా కాంప్ వారిని అడిగితే వారి సమాధానం కూడా లాజిక్ గా ఉంది. అదేంటంటే “ఇలా టైటిల్స్ ని కాపాడుకోవడం కోసమే డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్టర్ చేసుకునే పనైతే చిరు 150 సినిమాల్లో ఎంత లేదన్నా అలాంటివి యాభైకి పైగానే ఉన్నాయని మరి వాటిని ఎలా మేనేజ్ చేయాలనీ ప్రశ్నించారట”. నిజమే ఘరానా మొగుడు-ఖైది-కొదమసింహం- దొంగ- రాక్షసుడు-ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటిని అదే పనిగా రిజిస్టర్లు రెన్యువల్స్ చేయిస్తూ కూర్చోవడం జరిగే పని కాదు. కనుక ఇక అభిమానులు గొడవ మానేసి , ఎలాగూ నాని కూడా చిరంజీవి కి వీరాభిమానే కనుక, తను వాడుకున్న మన వాడే అనుకుని ఈ విషయం ఇంతటితో ముగించడం మేలు.

Tags : Gang Leader, Nani, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel