back

అభిమాని మేలు గురించి ఆలోచించేది మెగా ఫ్యామిలీ - టాక్సీవాలా నిర్మాతShare via:

“ఎక్కడో ఏలూరులో ఇంటి పక్కనే సినిమా హాలు ఉండడంతో సినిమాల పైన పిచ్చి పెంచుకుని తర్వాత మెగాస్టార్ ఫ్యాన్గా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి ఫ్లెక్సీలు కట్టిన ఒక అభిమానిని ఈ రోజు గీత ఆర్ట్స్ తో కలిసి సినిమా తీసే అవకాశం వచ్చిందంటే అది నేను మెగా అభిమానిని అవ్వడం వల్లనే” - నిన్నటి టాక్సీవాలా సినిమా ప్రీ-రిలీజ్ కం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్.కె.ఎన్ మాటలు.

ఎస్.కె.ఎన్ నిర్మించిన `ట్యాక్సీవాలా` ట్రైలర్ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేసి ట్రైలర్ ని లాంచ్ చేశారు. అంతేకాదు.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ఎస్.కె.ఎన్ ని అభినందించారు. ఈ వేదికపై నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ “ ఈ స్టేజ్ పై నేను నిర్మాతగా ఉండటానికి అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు కారణమని తెలిపారు. అభిమానులంటే కేవలం జెండాలు మాత్రమే కట్టరు. ఆ జెండాల్లో వారి పేరు కూడా ఉండేలా చేయాలని ప్రపంచంలో ఏ నిర్మాతా అనుకోడు. వాళ్ల కుటుంబంలో వ్యక్తినే నిర్మాతగా చేస్తారే కానీ.. మన ఫ్యాన్. టాలెంట్ ఉందని చెప్పి నిర్మాతను చేశారు అల్లు అరవింద్. ఆయన మాత్రమే అలాంటి అవకాశం ఇవ్వగలరు. అవకాశం దక్కడం ఎంత కష్టమో నాకు తెలుసు. బన్నివాసు అయినా.. నేనైనా ఇండస్ట్రీకి వచ్చి పది పదిహేనేళ్ల పాటు మా టాలెంట్ ను నిరూపించుకున్నాం. మమ్మల్ని అరవింద్ గారు నిర్మాతల్ని చేశారు.. అని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఎస్.కె.ఎన్.

Tags : Mega Family, Mega Fans, Taxiwala Producer

Write a comment ...
Post comment
Cancel