back

రాంచరణ్ - బోయపాటి సినిమాకి మెగా డీల్..



Share via:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్టామినా రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన ఈ సినిమా... డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాబాలను సమకూర్చింది. రంగస్థలం మొత్తంగా 125 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇప్పుడు రాంచరణ్ చేస్తున్న తదుపరి చిత్రానికి మెగా డీల్ వచ్చింది. ఈ సినిమాకి ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 70 కోట్ల భారీ ఆఫర్ చేసిందని వినికిడి. ఇంత పెద్ద మొత్తంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫర్ రావడంతో #RC12 మూవీ టీం ఇంకా జోష్ తో పని చేస్తుందంట.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు, తారలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ బడ్జెట్ పైన దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

Tags : RC12, Mega Deal For Ram Charan - Boyapati Movie, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel