back

మెగా డాటర్ ఒక మంచి డిజైనర్. || సుష్మిత



Share via:

మెగా ఫ్యామిలిలో చాలా మంది హీరోలు ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళని కూడా కలుపుకుంటే డజను పైనే, ఇక హీరోయిన్ గా మారోవైపు నిహారికా కొణిదెల కూడా ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత 'ఖైదీ నెంబర్ 150'వ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా కావడంతో మొదట అనుమానాలు వచ్చినా సినిమా రిలీజ్ తరువాత ఆమె టాలెంట్ ఏంటో అర్ధమయ్యింది. మెగాస్టార్ స్టయిలిష్ గా కనిపించడంలో ఆమె కృషి చాలానే కనిపించింది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో ఇంకాస్త టాలెంట్ బయటపడింది.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ డిగ్రీ కూడా పూర్తి చేసుకున్న సుష్మిత చిరంజీవి నటించిన డాడీ , టాగోర్, ఇంద్ర సిన్మాల కాస్ట్యూమ్స్ డిపార్టుమెంటులో పని చేసారు. పెళ్లి తరువాత సినిమాల్లో ట్రై చేద్దామనుకున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది. ఓ మంచి ఇల్లు సెట్ చేసుకొని కొత్త ప్రారంభం అంటూ సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేసుకున్నారు.

సుస్మిత ఇంతకు ముందు చెన్నై లో ఫ్యామిలీతో ఉండేది. కానీ ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా సక్సెస్ అవ్వడంతో హైదరాబాద్ కు మకాం మార్చేసింది.

My chennai summers#viewfrommybalcony #chennaicolors #heartwarmingmornings will miss this view for a while

A post shared by Sushmita (@sushmitakonidela) on

Tags : Mega Daughter, Sushmita Sen, Fashion Designer, Khaidi No 150, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel