back

చెర్రీ - బోయపాటి సినిమాకి కొత్త కెమెరామెన్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ రిషీ పంజాబీ తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి, ఇప్పుడు అది నిజమే అని యూనిట్ వర్గాలు తెలియచేశాయి.

రిషి ఈ చిత్రం నుండి ఏ కారణంగా తప్పుకున్నాడనే విషయంపై రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీనుతో వివాదం కారణంగా ఈ చిత్రంకు రిషి దూరం అయినట్లుగా కొందరు చెబుతుండగా - మరి కొందరు మాత్రం ఈ చిత్రంకు ముందే ఒక హిందీ సినిమాను రిషి కమిట్ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల చరణ్ మూవీ ఆలస్యం అవ్వడంతో - ముందే కమిట్ అయిన సినిమా ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని మద్యలోనే వదిలేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

రిషి స్థానంలో ఆర్థర్ విల్సన్ ను తీసుకోవడం జరిగింది. త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులతో ఆయన జాయిన్ కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

Tags : Mega Power Star, Ram Charan, Boyapati Srinu, RC12

Write a comment ...
Post comment
Cancel