back

రంగస్థలం చూసిన మహేష్ బాబు ఇలా అన్నాడు..!



Share via:

రంగస్థలం కలెక్షన్ల సునామీలో... ఒక్కొక్క సినిమా రికార్డ్స్ కొట్టుకుపోతున్నయి. ఈ సినిమా అన్ని ఏరియా ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రముఖులు తమ అభినందనలు తెలిపిన విషయం మనకు తెలిసిందే.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

ఈ మధ్యే ఈ సినిమాను చుసిన మహేష్ బాబు.. రంగస్థలాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. ఈ సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మరో అద్భుతాన్ని సృష్టించారు అంటూ పొగిడారు, అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని మరియు హీరోయిన్ సమంతా గురించి మాట్లాడుతూ మీ కెరీర్లోనే గొప్ప నటన ప్రదర్శించారు అంటూ ఇద్దరికి అభినందనలు తెలిపాడు. అలాగే సుకుమార్ నువ్వు నిజంగా మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్, దేవి నువ్వు నిజమైన రాక్ స్టార్, రత్నవేలు ఎప్పటికి గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటూ రంగస్థలం యూనిట్ కి అభినందనలు అందించాడు ట్విట్టర్ వేదికగా.

అలాగే రీసెంట్ గా రంగస్థలం చూసిన రాజమౌళి కూడా చిట్టిబాబు పాత్రను సుకుమార్ రాసిన, తెరపై ఆవిష్కరించిన తీరు బాగుందని, చరణ్ నటన చూసేందుకు ఒక ట్రీట్ లా ఉందని పొగిడేశారు.

Tags : Mahesh Babu on Rangasthalam, Mahesh Babu Praised Rangasthalam, Mahesh Babu on Ram Charan

Write a comment ...
Post comment
Cancel