back

రామచరణ్ ఆ డైలాగ్ ఒక్క టేక్ లో చెప్పేసాడు - మధునందన్



Share via:

నితిన్ సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యాడు యాక్టర్ మధునందన్. మంచి టైమింగ్ తో నటించే ఇప్పటి తరం నటుల్లో మధునందన్ కూడా ఒకరు. బోయపాటి-రామచరణ్ ల ‘వినయ విదేయ రామ’ సినిమాలో ఒక ముఖ్యపాత్ర చేస్తున్న మధునందన్, ఈ సినిమా విశేషాల గురించి ఒక ఛానల్ తో పంచుకుంటూ సినీ అభిమానులకు రాంచరణ్ ఇలాంటి వాడు అనేది మరో సారి చాటి చెప్పాడు.

“రాంచరణ్ తో నటించడం చాల సౌకర్యంగా ఉండేది, తను చాలా మంచివాడు. అంతా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన కూడా మాలాంటి వాలంధరితో సరదాగా గడుపుతాడు. తను టోటల్ గా ‘డౌన్ టు ఎర్త్’ “అని చెప్పేసాడు.

“టీజర్ లో వచ్చే పవర్ఫుల్ డైలాగ్ రామ్ కొ..ని..దె..ల సీన్ రామచరణ్ కేవలం ఒకే టేక్ లో పూర్తి చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది” అని చెప్పారు.

ధ్రువ మరియు రంగస్థలం సినిమాలతో తనకి యాక్టింగ్ రాదూ అనే వాళ్ళ నోర్లు మూయించిన రామచరణ్ , ఈ సినిమాతో సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్- ఆఫీస్ షేక్ ఆడించడంలో సందేహం లేదు.

Tags : Ram charan, Vinaya Vidheya Rama, Madhu Nadhan

Write a comment ...
Post comment
Cancel