back

చిరంజీవిని కలిసిన కూకటపల్లి ఎం.ఎల్.ఎ



Share via:

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలలో అందరి చూపు కూకటపల్లి సీటు పైనే..ఎందుకంటే అక్కడ తెలుగుదేశం తరుపున హరికృష్ణ కుమార్తె సుహాసిని నిలబడడమే. టిడిపి కి కంచుకోట లాంటి స్థానంలో అందులోనూ ఎన్టీఆర్ మనువరాలు నిలబడగా టిఆరెస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు సుమారు 41 వేల మెజారిటీ తో గెలవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. టిడిపి అనుకూలురు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో టిఆరెస్ కి అంతా మెజారిటీ ఎలా వచ్చింది అనేదానికి చాలా కారణాలు ఉండగా అందులో ఒకటిగా చెప్పుకునేది ‘కాపు’ కులస్తులు మూకుమ్మడిగా టీఆరెస్ కి వోట్లు వేసారు అని. మరి అది ఎంత వరకు నిజమో తెలీదు కాని మొన్న నూతన సంవత్సరం సందర్బంగా కూకటపల్లి ఎం.ఎల్.ఎ. మాధవరం కృష్ణారావు మెగాస్టార్ చిరంజీవి ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలపడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.


అయితే ఈ కలయిక వారి మధ్య ఉన్న పాత సంబంధాలు వలన లేక గత ఎన్నికలలో చిరంజీవి మాధవరం కోసం లోలోపల ఏమైనా మంత్రాంగం నడిపార అనేది తెలియరావాల్సి ఉంది.

చిరంజీవి - కొరటాల శివ సినిమాకి ముహూర్తం ఖరారు ..

Tags : Chiranjeevi, Kukatpally MLA

Write a comment ...
Post comment
Cancel