back

చిరు కోసం బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్ చెక్కుతున్న ప్రముఖ దర్శకుడు



Share via:

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ సినిమా అయిన ఖైదీ నం. 150తో తన ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అద్బుతమైన కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.

చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సారధ్యంలో చేయ్యబోతున్నట్టు సమాచారం. ఈ చిత్ర స్క్రిప్ట్ కోసం కొరటాల చాల కష్టపడుతూ అత్యంత పకడ్బందిగా తయారు చేస్తున్నట్టు వినికిడి. మెగాస్టార్ స్టైల్, మ్యానరిజంని దృష్టిలో ఉంచుకొని అన్నయ్య స్థాయిని ఇంకో మెట్టు ఎక్కించేలా స్టోరీని పొండుపరుస్తున్నాడట.

మరి కొరటాల స్టైల్ అఫ్ మేకింగ్... మన బాసు కలిస్తే ఇక బాక్స్ బద్దలవ్వాల్సిందే!

ఇక ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆదరంగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2019 వేసవి కానుకగా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel