back

చిరంజీవితో కొరటాల సినిమా ఫిక్స్ అయినట్లే ..!



Share via:

సైరా సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమాని కూడా లైన్ లో పెట్టాడని ఇండస్ట్రీ టాక్. భరత్ అనే నేను సినిమా తరువాత పక్కా కమర్షియల్ మూవీ తీస్తా అన్న కొరటాల శివ అందుకోసం మెగాస్టార్ చిరంజీవితో జట్టుకట్టడానికి డిసైడ్ అయిపోయారు.

ఈ సినిమాకోసం నవంబర్ నుంచి డేట్ లు కేటాయిస్తానని చిరంజీవి చెప్పారని వినికిడి. నవంబర్ కు చిరంజీవి వంతు వర్క్ సైరా లో అయిపోతుందని ఆ వెంటనే ఈ సినిమా పట్టలేక్కనుందని అంటున్నారు.

ఈ లోగా కొరటాల బౌండ్ స్క్రిప్ట్ పని చేసుకుంటారు. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి రామ్ చరణ్ - కొరటాల కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సి వుంది. మరి ఆ ప్రాజెక్టునే ఇలా మారుస్తారా? లేక రామ్ చరణ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై చేస్తారా? అనే విషయాలు ఇంకో రెండు మూడు నెలల్లో తెలిసిపోతుంది.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel