back

కొరటాల శివ తోనే చిరు నెక్స్ట్



Share via:

భరత్ అనే నేను అనే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 7 నెలలు. మరి వరుసగా 4 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడెం చేస్తున్నారు అంటే అందరు చిరంజీవి తో సినిమా కోస్సం వెయిట్ చేస్తున్నారు అంటారు.

ఆ సినిమా కథా చర్చలు మరియు పాత్రల ఎన్నిక జరుగుతుందని చెప్పవచ్చు. కాని ఆ మధ్యలో కొన్ని వార్తలు చాలా వేగంగా షికారు చేసాయి, అవే సైరా ఆలస్యం కారణంగా కొరటాల సినిమా కూడా మోదలవడం ఆలస్యం అవుతుందని అందుకే కొరటాల మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని. ఆసలే స్లో గా సినిమా తీసే కొరటాల ఇప్పుడు వేరే సినిమాకి కమిట్ అయితే మరి ఇక మెగాస్టార్ తో ఎప్పుడు తీస్తాడని మెగా అభిమానులంతా ఆందోళన చెందారు.


అయితే ఈ వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది.

ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాలతోనే అని ఈ సినిమా నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. కథా చర్చలు ఇంకా సాగుతున్నాయి, ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్, హీరోయిన్ గ హ్యూమా కురేషి ని సెలెక్ట్ చేసినట్లు కూడా వినికిడి.


సంక్రాంతి తర్వాత ఈ సినిమా ముహూర్తం ఉండచ్చుఅని కుడా చెప్తున్నారు. సో... మేగాభిమానులు మరో బ్లాక్బస్టర్ కి సిద్ద్డం అవ్వండి.

Tags : Megastar Chiranjeevi, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel