back

మెగాస్టార్ ని కలుసుకున్న న్యాయశాఖ మంత్రి కొళ్ళు రవీంద్ర



Share via:

మచిలీపట్నం నియోజకవర్గం అభివృధ్ధికి రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం చివరిరోజులలో ప్రఖ్యాత నటుడు చిరంజీవి గారు తన యం.పి లాండ్స్ నుంచి రూ॥ ఐదు కోట్లు ఇచ్చారు. ఈ నిధులతో నియోజక వర్గంలో పలు అభివృధ్ధి పనులు చేపట్టడమైనది. ఇటీవల హైదరాబాద్ లో న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ యం.పి చిరంజీవిని కలిసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి మాట్లాడుతూ తాను ఇచ్చిన యం.పి లాడ్స్ ను ప్రజోపయోగమైన పనులు చేపట్టడం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ రోజు మచిలీపట్నంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్రకు, రాజ్యసభ ఎం.పీ మరియు సినీ నటులు శ్రీ చిరంజీవి గారికి - మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూయలరీ పార్కు అసోసియేషన్ వారు, పోతేపల్లి, చిన్నాపురం, తాళ్ళపాలెం తదితర గ్రామాల ప్రజలు రాజ్యసభ ఎంపీగారి నిధులను తమ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగించడం పట్ల తమ కృతజ్ఞతలు తెలియజేసారు.

Tags : Kollu Ravindra, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel