back

చిరంజీవితో తన మొదటి సినిమా తీసిన శతాధిక దర్శకుడు కోడి రామక్రిష్ణ ఇక లేరు..



Share via:

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం చేసి గురువుకి తగ్గ శిష్యుడిగా 100 కి పైన సినిమాలకు దర్శకత్వం చేసిన శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న రామకృష్ణ నిన్న ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో సీరియస్ పొజిషన్ లో ఉన్న ఆయన ఈ రోజు తన తుది శ్వాస విడిచారు. ఎన్నో గొప్ప సినిమాలు తీసిన కోడి రామకృష్ణ తెలుగు సినిమాకి అమ్మోరు సినిమాతో గ్రాఫిక్స్ పరిచయం చేసిన మొదటి దర్శకుడిగా చెప్పుకోవచ్చు.


1982 లో తన తొలి సినిమాగా చిరంజీవి, మాధవి ముఖ్య పాత్రల్లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’నే 500 రోజులు ఆడడం తో కోడి రామకృష్ణ తనకంటూ ఒక ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత విభిన్న జోనర్లలో సినిమాలు రూపొందించారాయన. తలంబ్రాలు, మువ్వగోపాలుడు వంటి సాంఘిక సినిమాలే కాక , అంకుశం, శత్రువు, భారత్ బంద్, ఆహుతి.. వంటి విప్లవాత్మక సినిమాలతో కూడా కోడి రామకృష్ణ గుర్తుండిపోతారు. ‘అమ్మోరు’ కోడి రామకృష్ణ రేపిన మరో సంచలనం. అమ్మోరు సూపర్ హిట్ కావడంతో.. ఆ జోనర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అలా మరో ట్రెండ్ సెట్ చేశారు కోడి.ఇక సినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా మెగాస్టార్ తో చేసిన “అంజి’ సినిమా ఆయనకి ఎన్నో ప్రసంశలు అందాయి. ఆయన సహచర దర్శకులు దాదాపుగా ఆగిపోయిన సమయంలో.. అరుంధతి ని రూపొందించి సంచలనం రేపారు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు అడపాదడపా కన్నడలో కూడా సినిమాలు రూపొంచారాయన. అందులో భాగంగా 2016 లో కన్నడలో వచ్చిన ‘నాగరహావు’ కోడి రామకృష్ణ చివరి సినిమా అయ్యింది.

Tags : Kodi Rama Krishna, Chiranjeevi, Dasari Narayanrao

Write a comment ...
Post comment
Cancel