back

చిరంజీవి తన పాత్ర నచ్చకున్నా సినిమాలో నటించాడు - కోడి రామక్రిష్ణ



Share via:

100 పైన చిత్రాలు తీసిన అతి కొద్ది తెలుగు దర్శకులలో ఒకరు కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు దగ్గర శిష్యుడిగా చేసి తన మొదటి సినిమాగా చిరంజీవి హీరోగా కథా బలంతో వచ్చిన సినిమానే “ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య”. మొదటి సినిమానే సంవత్సరం ఆడడంతో కోడి రామకృష్ణ కి తర్వాత ఎదురు లేకుండా పోయింది. ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సంబంధించి ఆయన చెప్పుకొస్తు , చిరంజీవి కి తన పాత్ర నచ్చకపోయినా ఈ సినిమా చేయడం వెనక కారణాలు తెలియచేసారు ...

లైవ్: నా పేరు సూర్య థాంక్స్ మీట్

“సినిమా విషయంలో నిర్మాత రాఘవ గారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో చిరంజీవిని వెళ్లి కలిశాను, అదే తొలిసారి ఆయన్ను కలవటం. తనకు కథ నచ్చితేనే సినిమాకు ఓకే చెబుతానని చెప్పారు. కథ విన్నాక తన పాత్ర చాల్లేదన్నారు, కానీ పూర్ణిమ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చింది. సంగీత క్యారెక్టర్ కూడా నచ్చింది. ఆడోళ్లంతా లైక్ చేస్తారు కాబట్టి.. ఆ రెండు పాత్రల మధ్య నా పాత్ర సాయం చేస్తుందన్నారు. విలన్ క్యారెక్టర్ కూడా నచ్చిందన్నారు. తన పాత్ర నచ్చకున్నా మిగిలిన వారి పాత్రలు నచ్చటంతో సినిమాను చేసేందుకు ఓకే అన్నారు. తన పాత్ర నచ్చకున్నా మిగిలిన వారి పాత్రలు నచ్చి సినిమాను చేయటం గొప్ప. అలా ఆలోచిస్తారు కాబట్టే ఈ రోజున మెగాస్టార్ అయ్యారని గుర్తు చేసుకున్నారు.”

అస్సలు ఈ సినిమాకి చిరంజీవినే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకు ఆయన
“చిరులో ఉండే నేచర్ నాకు చాలా నచ్చేది. పట్టుదల ఉన్న వ్యక్తి. బాగా యాక్ట్ చేయాలని తపించేవారు. ఏదైనా సాధించాలన్న భావన ఎక్కువ. అందుకే నా తొలి సినిమా కథను నిర్మాత రాఘవకు చెప్పగానే ఎవరు హీరో అన్నారు? నేను దానికి చిరంజీవి అని చెప్పా. ఆయనైతేనే సినిమాకు సరిపోతారండి అన్నా. అన్ని తరాల వారికి నచ్చిన హీరో చిరంజీవి. అయితే అప్పట్లో ఆయన పెద్ద స్టార్ కాదు. టాలెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎందుకు అవమానిస్తున్నారన్న ఫీలింగ్ తో సినిమాకు లాభంగా మారుతుందని చెప్పటంతో రాఘవ గారు ఓకే చెప్పారు.”

లైవ్: నా పేరు సూర్య థాంక్స్ మీట్

Tags : Kodi Ramakrishna, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel