back

చిరంజీవి గారితో నటించడం గౌరవంగా బావిస్తున్నా - కిచ్చ సుదీప్



Share via:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `సైరా`. ఈ సినిమాను భారీ బడ్జెట్తో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన ప్రముఖ నటులైన అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, తమిళ్ హీరో విజయ్ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

 

ఈ సినిమాలో కిచ్చ సుదీప్.. అవుకు రాజు పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసన సుదీప్ `సైరా` గురించి స్పందించాడు. `లెజెండ్, జెంటిల్మెన్ చిరంజీవిగారి ఆతిథ్యం, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావడం ద్వారా చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. సురేందర్ రెడ్డి, అతని టీమ్కు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టుకు మూలస్తంభంగా నిలిచిన రాంచరణ్ కి ధన్యవాదాలు` అని సుదీప్ కామెంట్ చేశాడు.

Tags : Kichcha Sudeep, Megastar Chiranjeevi, Sye Raa Narasimha Reddy

Write a comment ...
Post comment
Cancel