భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని. తన రెండో తెలుగు సినిమాలో రాంచరణ్ తో కలిసి నటించిన అమ్మడు, ఇప్పుడు ఆ సినిమా ‘వినయ విదేయ రామ’ ప్రచారం లో పాల్గొంటుంది. దానికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో రాంచరణ్ గురించి మాట్లాడుతూ కియారా ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది... అదేంటో తన మాటల్లోనే
రామ్ చరణ్ దేనా ఈ సంక్రాంతి ..!
"నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నటినయ్యా. బేసిగ్గా డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి చరణ్ లాంటి డ్యాన్సర్‌తో స్టెప్స్ వేస్తూ, చాలా ఎంజాయ్ చేశాను. నాకు 'రామా వెడ్స్ సీత' ఇప్పటి వరకు నేను చేసిన సాంగ్స్‌లో మోస్ట్ ఫేవరేట్. 800 మంది డ్యాన్సర్స్‌తో చాలా గ్రాండ్‌గా ఆ పాటని పిక్చరైజ్ చేశారు.సినిమాలో నాకు, చరణ్‌కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రాంచరణ్‌కి ఇన్స్టాగ్రామ్ అంటే చాలా ఇష్టం. ఆయనకీ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలీదు" అని రామచరణ్‌కు సంబంధించిన సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది.
ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్
ఇప్పటి వరకు రాంచరణ్ ఫేస్బుక్ అకౌంట్ ని ఫాలో అవుతున్న మెగా అభిమానులు, ఇక ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వెతికేస్తున్నారు. ఆ వీడియో మీకోసం ..
Tags : Ram Cgaran, Kiara advani, Vinaya Vidheya Rama