back

మెగాస్టార్ చెల్లిగా మహానటి



Share via:

మెగాస్టార్ కొత్త సినిమా వేదాళం రీమేక్ కు మరో క్లియరెన్స్ దొరికేసింది. ఈ చిత్రంలో చెల్లి పాత్రలో ఎవరు నటిస్తారనే సందేహాలకు తెరపడింది. నిన్న మొన్నటి దాకా సాయి పల్లవి నటిస్తుందని అనుకున్న పాత్రలోకి మహానటి వచ్చేసింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తుందని సమాచారం.

వేదాళం తెలుగు రీమేక్ ను దర్శకుడు మెహర్ రమేష్ రూపొందిస్తున్నారు. చిరు ఆచార్య సినిమా తర్వాత ఈ సినిమానే సెట్స్ మీదకు వెళ్లనుంది. వేదాళంలో చెల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పాత్రను కీర్తి సురేష్ అయితే మెప్పిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

Tags : Chiranjeevi, Megastar, Vedalam remake, Keerthy Suresh

Write a comment ...
Post comment
Cancel