back

పుట్టిన రోజు నాడే స్ఫూర్తినిచ్చిన కళ్యాణ్ దేవ్ ..



Share via:

నిన్నటి రోజు తన పుట్టిన రోజు సందర్బంగా మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పని ఎంతో మందికి స్పూర్తినిచ్చేలా ఉంది. మామూలుగా పుట్టిన రోజు అనగానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి పార్టీలు ఇచ్చే ఈ సమాజంలో అందరిని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ దేవ్ ని కచ్చితంగా అభినందించాల్సిందే.


చనిపోయిన తర్వాత అవయవాలను మట్టిలో కలిపేయకుండా అవయవదానం ఇవ్వాలంటూ ఎన్నో స్వచ్చంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. కాని పెద్దగా జనాలు ఆసక్తి చూపడం లేదు. కళ్యాణ్ దేవ్ తన పుట్టిన రోజు సందర్బంగా ఈ పనికి ముందుకు వచ్చి అపోలో హెల్త్ కేర్ వారికి అవయవ దానం చేయడం నిజంగా హర్షనీయం. ఆయన రియల్ హీరో అనిపించకున్నాడు .

ఫొటోస్ : పుట్టిన రోజునాడు కళ్యాణ్ దేవ్ అవయవ దానం

Tags : Megastar, Kalyan Dhev

Write a comment ...
Post comment
Cancel