back

ఫస్ట్ లుక్ : మెగా ‘అల్లుడు’ కు జన్మదిన శుభాకాంక్షలు ...



Share via:

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్, మెగా అల్లుడు గా అందరికీ తెలిసిందే. అలాగే తనలో కూడా ఒక నటుడు ఉన్నాడు అని నిరూపించుకునేందుకు అతను తీసిన సినిమా ‘విజేత’ సినిమా మంచి సినిమాగా పేరు పొందిన కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. అదే క్రమంలో తన రెండో సినిమాగా 'రిజ్వాన్-ఎంటర్ టైన్  మెంట్స్'లో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ రోజు ఈ మెగా అల్లుడి పుట్టిన రోజు కావడంతో ఆసినిమా యూనిట్ 'హ్యాపీ బర్త్ డే కల్యాణ్ దేవ్' అంటూ ఈ సినిమాలో ఒక స్టిల్ ను పోస్టర్ రూపంలో విడుదల చేసింది. ఒకరకంగా ఇదే ఫస్ట్ లుక్ . 


తొలి సినిమా కమర్షియల్ హిట్ కాకపోవడంతో ఈ సినిమా తనకు మంచి మైలెజ్ ని ఇస్తుంది అని కల్యాణ్ దేవ్ నమ్ముతున్నాడు. ఇక ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తూ ఉండగా - రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పై కుషి - రిజ్వాన్ ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యీ - కల్యాణ్ కి మంచి బ్రేక్ ని ఇవ్వాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...కళ్యాణ్ దేవ్ కి జన్మదిన శుభాకాంక్షలు ..

Kalyandhev-Firstlook-secondfilm

Tags : Chiranjeevi, Kalyan Dev

Write a comment ...
Post comment
Cancel