back

చెర్రీ చిలిపి అంటున్న కైరా ..



Share via:

ధోని సినిమాతో హిందీ సినిమా అరంగేట్రం చేసి భరత్ అనే నేను సినిమాతో తెలుగు సిని పరిశ్రమలోకి ఘన విజయంతో అడుగు పెట్టిన నటి కైరా అద్వాని. అందం, నటన రెండు కలిసిన ఈ నటి మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ని సాధిస్తుంది. ఇప్పుడు తెలుగులో తన రెండో సినిమాగా బోయపాటి శీను దర్శకత్వంలో రాంచరణ్ పక్కన నటిస్తుంది.

మరి ఈ సినిమాలో చరణ్ తో నటించడం ఎలా ఉంది అని కియారాను అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.  షూటింగ్ లొకేషన్ లో ఫుల్ ఫన్ గా ఉంటుందని చరణ్ చిలిపి పనులు చేస్తుంటాడని చెప్పింది. చరణ్ ఒక అమేజింగ్ కో-స్టార్ అని కితాబిచ్చింది. చరణ్ పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో అణకువతో ఉంటాడని రోజంతా యాక్టివ్ గా ఉంటాడని చెప్పింది. 

Tags : Ram charan, Kaira Advani

Write a comment ...
Post comment
Cancel