back

బావ కంగ్రాట్స్ - ఎన్టీఆర్ | అల వైకుంఠపురములో



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `అల..వైకుంఠపురములో`. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాను వీక్షించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా బ‌న్నీ, త్రివిక్ర‌మ్ స‌హా యూనిట్‌ను అభినందించారు. ``చాలా ఇష్టంగా అద్భుతంగా న‌టించిన అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్‌గారి బ్రిలియంట్ రైటింగ్ కార‌ణంగా `అల వైకుంఠ‌పుర‌ములో` చాలా గొప్ప‌గా రూపొందింది. బావా, సామీల‌కు కంగ్రాట్స్‌`` అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్‌. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌యరాం, ట‌బు, స‌చిన్ ఖేడేక‌ర్, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Tags : Allu Arjun, Stylish Star, Ala Vaikuntapurramulo, Jr NTR

Write a comment ...
Post comment
Cancel