back

రామ్ చరణ్, ఎన్టీఆర్... మల్టీ స్టారర్ లో రాజశేఖర్ ఉన్నాడా, లేడ... జీవిత మాటల్లో !



Share via:

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు హీరోలుగా నటించబోతున్న మల్టీస్టారర్‌కు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. దీనిని dvv దానయ్య నిర్మిస్తున్న విషయం కూడా తెలుసు. మెగా, నందమూరి కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటే విలన్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడనే విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్,ఎన్టీఆర్ తప్ప మిగతా కాస్టింగ్ ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు. దీంతో దీనికి సంబంధించి బోలెడు గాసిప్స్ వచ్చేస్తున్నాయి.

సీనియర్ హీరో రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీలో పాత్ర చేయబోతున్నాడనే టాక్ తాజాగా వినిపిచింది, కానీ రాజశేఖర్ భార్య జీవిత ఈ టాక్ ను కొట్టిపారేసింది. విలన్ గా నటించాలంటూ రాజమౌళి నుంచి తమకు ఎలాంటి ఆఫర్ ఇప్పటికి రాలేదని చెప్పేసింది. తమ కుమార్తె శివాని సినిమా లాంచింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా రాజమౌళిని కలిసి ఆహ్వానించామని.. దాంతో ఈ టాక్ వచ్చి ఉంటుందని జీవిత అంటోంది.
చూడాలి మరి..

Tags : Jeevitha Rajasekhar, #RRR Movie Updates, #RRR News, Ram Charan, NTR, SS Rajamouli

Write a comment ...
Post comment
Cancel