back

సంక్రాతి సంబరాల్లో జనసేనాని...



Share via:

తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల్లో సంక్రాంతి సంబ‌రాల‌కి అగ్ర‌స్థాన‌మే ఉంది. ఆ సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన‌నున్నారు.


ఈ నెల 13వ తేదీన భోగి పండుగ‌తో ఈ సంబ‌రాలు ఆరంభ‌మ‌వుతాయి. తెనాలికి స‌మీపంలోని పెద‌రావూరులోని ఒక‌ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబ‌రాలు ప్రారంభ‌మ‌వుతాయి. తొలుత భోగి మంట‌ల వేడుక‌ల్లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు పాల్గొంటారు. ధాన్యం ఇంటికి చేరే స‌మ‌యంలో ఈ పండుగ మ‌న‌మ‌నంతా జ‌రుపుకొంటామ‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటి ధాన్యాన్ని మ‌న‌కి ఇచ్చే రైతుల‌తో ఇష్టాగోష్టి ఉంది. ఆ ఇష్టాగోష్టిలో శ్రీ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారు పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మానికి డెల్టాలోని ప‌లు ప్రాంతాల నుంచి రైతులు వ‌స్తున్నారు. అనంత‌రం స్థానిక ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతారు. త‌రవాత ఆడ‌ప‌డుచులు నిర్వ‌హించే సంక్రాంతి శోభ‌లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు పాలుపంచుకుంటారు.

ఈ సంబ‌రాల సంద‌ర్బంగా జ‌న‌సేన పార్టీ సాంస్కృతిక విభాగాన్ని ఆయ‌న ప్రారంభిస్తారు. జ‌న‌సేన‌లోని క‌ళాకారులు రూపొందించిన ఆడియో, వీడియోల‌ను ఆవిష్క‌రిస్తారు. రాత్రి 8 గంట‌ల‌కు ఈ సంబ‌రాలు ముగుస్తాయి. సంక్రాంతి సంబ‌రాల ఏర్పాట్ల‌ను పార్టీ ముఖ్య‌ నేత‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మాజీ స్పీక‌ర్‌.. జ‌న‌సేన ముఖ్య‌నేత శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ముఖ్య‌నాయ‌కులు మాజీ మంత్రులు శ్రీ బాల‌రాజు, శ్రీ రావెల కిషోర్‌బాబు, జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు, స్టేట్ క‌న్వీన‌ర్ శ్రీ చింత‌ల పార్థసారధి, స్టేట్ కో క‌న్విన‌ర్‌ ప్రభు త‌దిత‌ర రాష్ట్ర నేత‌ల‌తో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల‌కి చెందిన జ‌న‌సేన స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, స‌హ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, ముఖ్య‌నేత‌లు పాల్గొంటారు.

Tags : Pawankalyan, Janasenani, Pongal Celebrations

Write a comment ...
Post comment
Cancel