back

జనసేన - టిడిపి పొత్తు అంటే ఆత్మహత్యేనా ..?



Share via:

మొన్నటి ప్రెస్ మీట్ లో నవ్వుతూ పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర రాజాకీయాల్లో తుఫాన్ సృష్టించాయి. పొత్తు అనే మాట లేకుండా ఎన్నికలకు వెళ్ళని చంద్రబాబు నాయుడు, ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే ఏదో ఒక పార్టీని పక్కన చేర్చుకోవడం ఆయన యొక్క ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం కూడా కొంత కాలం క్రితమే తమతో తెగదెంపులు చేసుకున్న జనసేన పార్టీని తిరిగి తమతో కలవమని సంకేతాలిస్తున్నారు.


మరి ఇక తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణే. గత కొన్నాళ్లుగా బాబును, లోకేష్ ని, వారి పాలనను తెగ తిట్టేస్తూ, టీడీపీ నేతలు కొందర్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ వచ్చిన పవన్, మరి బాబు ట్రాప్ లో పడి పొత్తు పెట్టుకుంటే జనసేన పరువు పూర్తిగా నశించిపోతుంది. టిడిపి తో అమితుమి కి సిద్ధమవుతున్న జనసైనికులకి అది ఆత్మహత్య తో సమానం. ఇదే విషయాన్ని పవన్ తో మంచి స్నేహం ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పుకొచ్చారు. ఏమ్మన్నారంటే ..

“"అధికార పార్టీతో కలిస్తే పవన్ కు భవిష్యత్ లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ను తిట్టిపోశాడు. బంగాళాఖాతంలో కలిపేద్దాం అన్నాడు. దాంతో ఎమోషనల్ జనం కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ను సముద్రంలో కలిపేద్దాం అంటే కుదరదు. టీడీపీని సముద్రంలో కలిపేద్దాం అనాలి. అలా అనకపోతే పవన్ కు భవిష్యత్తు లేదు. చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దు. పవన్, నేను కలిసి తిరిగితే తప్పా అని చంద్రబాబు అన్నాడు. ఇలాంటివి కావాలనే బాబు వదులుతుంటాడు. ఇద్దరూ కలిసిపోతున్నారంటూ అంటూ చిన్నగా వదుల్తాడు. దీంతో పవన్ తో ఎవరైనా ఓ 10 మంది ఉంటే వాళ్లు కూడా పవన్ ను వదిలిపోతారు. ఎందుకంటే పవన్ తో ఉన్న జనమంతా ఎమోషనల్. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే అతడు ఈ డ్రామాలు ఆడుతున్నాడు."

ఉండవల్లి చెప్పినట్లే ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట విలువైనదే. ఆయన ఏదో ఒక గోల్ తోనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తొందరగా రియాక్ట్ అవ్వకపోతే ఎంతో కొంత డామేజ్ జరిగే అవకాశం లేకపోలేదు..

Tags : PawanKalyan, Janasena, TDP

Write a comment ...
Post comment
Cancel