back

వై.సి.పి తో పొత్తులు గిత్తులు ఏమి లేవు - పవన్ కళ్యాణ్



Share via:

పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచాకాల పైన గొంతేత్తాడో అప్పటినుంచి వినిపిస్తున్న విషయం 2019లో జరిగే ఎన్నికలకు జగన్ - పవన్ కలిసి చంద్రబాబు ని ఎదుర్కోబోతున్నారు అని. వాళ్లిద్దరు కలిస్తే ఇంక టిడిపి కి అవకాశమే ఉండదని కూడా చాల మంది లెక్కలు వేసారు. కాని ఎప్పుడు కూడా జగన్ గాని పవన్ గాని తమ మాటల్లో ఈ పొత్తు ఉండదని చెబుతూనే ఉన్నారు. ఇక నిన్న చెన్నై లో జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మరోసారి ఆహ్ విషయాన్నీ చెప్పారు.

పవన్ ఏమ్మన్నారంటే ..
“జ‌గ‌న్‌తో తాను ఎలాంటి ర‌హ‌స్య మీటింగ్ జ‌ర‌ప‌లేద‌ని, వైసీపీ లాంటి అవినీతి, చేత‌కాని పార్టీతో పెట్టుకునే అవ‌స‌రం జ‌న‌సేన‌కు లేద‌ని, ఇవ‌న్నీ టీడీపీ గ్యాంగ్ ప్ర‌చారం చేసిన త‌ప్పుడు వార్త‌ల‌ని” ప‌వ‌న్ అన్నారు.

“ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కీ రోల్ ప్లే చేస్తుందని, జ‌న‌సేన పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని, నేనే ముఖ్య‌మంత్రి” అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

Tags : Janasena, YSRCP, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel