back

గుంటూరు లో కామెర్ల వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన జనసేన శ్రేణులు..



Share via:

గుంటూరు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన డయేరియా మరణాలను మరువకముందే కామెర్ల వ్యాధి పంజా విసిరింది.

ఈ మహమ్మారి ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది, చనిపోయిన వారిలో ఒక బాలింత, రోజుల శిశువు, మరో మహిళ ఉన్నారు.

నగరంలోని రామిరెడ్డి తోట, ప్రకాశ్ నగర్, గుంటూరు వారి తోట ప్రాంతాలలో సుమారు 180 మంది కామెర్ల వ్యాధి బారినపడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న జనసేన సైనికులు ఈ ప్రాంతాలలో ఇంటింటికీ పర్యటించి భాధితులను పరామర్శించి వ్యాధి వ్యాప్తి చెందటానికి గల కారణాలను సేకరించారు .

ఈ వ్యాధి సోకి చనిపోయిన బాలింత సాధు లక్ష్మీ లావణ్య (22) కుటుంబ సభ్యులకు జనసేన తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జనసేన శ్రేణులు సేకరించిన వివరాలమేరకు గత నెలరోజులుగా ఈ ప్రాంతాలలో త్రాగునీరు, డ్రెయినేజీ లో కలవటం వల్ల కామెర్ల వ్యాధి దావాణంలా వ్యాప్తి చెందింది, ఆ నీరు త్రాగిన వారందరూ తీవ్రమైన వాంతులు విరేచనాలు, కామెర్లతో బాధపడుతున్నారు.

ఈ సందర్భంగా యర్రగోపుల జయదీప్ మాట్లాడుతూ భాధితుల నుండి సేకరించిన వాస్తవాలను జనసేన పార్టీ తరఫున నగర కమీషనర్ గారికి, సంబంధిత మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇంతమంది చనిపోతున్నా అధికారుల్లో, అధికార పార్టీ నాయకుల్లో చలనం లేకపోవడం భాధకరం అని అన్నారు. ఈ మహమ్మారి డయేరియా, కామెర్ల వ్యాధులని, గుంటూరు తరిమికొట్టడానికి ప్రజల తరపున జనసేన ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.

Tags : Janasena Party, Janasena in Guntur

Write a comment ...
Post comment
Cancel