back

జనసేన టీవీ రాబోతున్నదా?



Share via:

మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు దాని పైన పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ రూపం మారుతోంది. రాజకీయాలలో మీడియా పాత్ర ఎంత ఎక్కువ ఉంటుందో అందరికీ తెలిసిందే, అలాగని ఒక్కరిని టార్గెట్ చేసే మీడియా రాజకీయాన్ని ఎవ్వరు సమర్ధించలేరు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగానే మీడియా పైన యుద్ధం ప్రకటించడంతో అభిమానులంతా ఇప్పుడు పవన్ కి కూడా ఒక టీవీ చానల్ ఉండాలని కోరుతున్నారు.

అది ఎంత అవసరం అన్నది జగన్ విషయం లో రుజువైంది కూడా...ఇంకా చెప్పాలంటే అప్పట్లో మీడియా సపోర్ట్ లేకనే చిరంజీవి ప్రజారాజ్యం గెలుపు సాధించలేకపోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. కానీ లోగో డిజైన్ నుంచి.. బ్యానర్ లో కనిపిస్తున్న మిగిలిన అంశాలు పరిశీలిస్తే మాత్రం.. ఇది జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ వెనుక ఉంది అనిపించక మానదు. మరి ఈ జేటీవీ లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

Tags : JanaSena TV, J TV, Pawan Kalyan, Power Star

Write a comment ...
Post comment
Cancel