back

జనసేన మరో ప్రజారాజ్యం కాదు...



Share via:

చిరంజీవి 2008 లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంత గొప్పగా ప్రారంబమైంది, తర్వాతి కాలంలో ఎలా కనుమరుగైంది అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో పార్టీ ఫండ్ కోసం కాని మరే ఇతర కారణాలతో కాని ఎన్నికలలో నిలబడబోయే అభ్యర్థుల దగ్గరనుంచి అల్లు అరవింద్ మరియు కొంతమంది డబ్బులు తీసుకోవడం, దానిని మీడియా అంతా టికెట్లు అమ్ముకున్నారు అని ప్రచారం చేయడంతో ప్రజరాజ్యం ఆ ఎన్నికలలో చాల దెబ్బతినింది. చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి చిరంజీవి చాల అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఆ రోజు తన అన్నకి జరిగిన దాన్ని దగ్గర నుంచి చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన జనసేనలో అటువంటివి జరగకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ మధ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రజారాజ్యం అప్పుడు జరిగిన తప్పులు మళ్ళి జరగకూడదు అనే భావనను వ్యక్తపరిచాయి.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...
"నేను ఎంతో విశాల హృదయంలో, చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే కొంతమంది చిన్నచిన్న ఆలోచనలతో ఉంటే ఎలా? మేం టిక్కెట్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెబితే నమ్మొద్దు. దానికి ఓ కమిటీ ఉంది. కేటాయింపు విధానంలో పారదర్శకత ఉంటుంది."

తప్పో ఒప్పో తనకు నచ్చినట్టు, నచ్చిన వ్యక్తులకు మాత్రమే టిక్కెట్లు కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇదీ ఒకందుకు మంచిదే... జనసేన అనేది మరో ప్రజారాజ్యం ఎంత మాత్రం కాదు అనే విషయాన్నీ జనాల్లోకి తీసుకేల్లినట్లే.

Tags : Janasena Party, Pawan Kalyan, Prajarajyam

Write a comment ...
Post comment
Cancel