back

జనసేన ఎన్నికల ఫలితాలపైన ఒక జనసైనికుని అద్భుత విశ్లేషణShare via:

2019 ఎన్నికల ఫలితాల్ని ఒక జనసైనికుడిగా నేను చుసిన విధానాన్ని మీకు చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను.

2004 లో దివంగత ముఖ్యమంత్రి వై ఏస్ ఆర్ గారు హాయాంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మా నాన్న కూడా పోటీ చేసారు. అప్పటినుండి నాకు రాజకీయాలు అంటే ఆసక్తి. మంచి రాజకీయ నాయుకులే మంచి సొసైటీని తయారు చేయగలరు అని నాకు ప్రగాడ నమ్మకం. మనం చూస్తున్న నాయుకుల వల్ల మనకి పాలిటిక్స్ అంటే నచ్చకపోవచ్చు గాని, సరైన లీడర్స్ ఉంటే మొత్తం దేశం స్థితిగతులే మార్చేయొచ్చు.

ఈ మెసేజ్ ని ముఖ్యంగా జనసేన ఐడియాలజీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఓపిగ్గా చదవగలరు అని నా మనవి.

ముందుగా మన పార్టీ కి రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ ఓట్లని అవరోహణ వరుసలో పరిశీలిస్తే.....

భీమవరం – 62285 (2 వ స్థానం)
గాజువాక – 58539 (2 వ స్థానం)
రాజోల్ – 50053 (మొదటి స్థానం)
నర్సాపురం – 49120 (2 వ స్థానం)
అమలాపురం – 45200 (2 వ స్థానం)
రాజమండ్రి రూరల్ – 42685
కాకినాడ రూరల్ – 39247 గన్నవరం – 36259
తాడేపల్లి గూడెం - 36197
కొత్తపేట – 35833
మండపేట - 35173
ముమ్మిడివరం – 33334
పాలకొల్లు – 32984
తణుకు - 31961
కాకినాడ సిటీ – 30188
విజయవాడ తూర్పు – 30137
తెనాలి – 30095
విజయవాడ సెంట్రల్ – 30033(సీ పీ ఐ)

30000 నుండి 20000 మధ్యన వోట్లు వచ్చిన నియోజక వర్గాలు - సుమారు 18 ( ప్రత్తిపాడు, పెడన, నీడదవోల్, రాజనగరం, గుంతకల్, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి సిటీ, భీమిలి, వైజాగ్ నార్త్, ఉండి(సీ పీ ఎమ్), పెందుర్తి, యలమంచిలి, రంపచోడవరం (సి పీ ఎమ్), అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్).

15000 నుండి 20000 వోట్లు వచ్చిన నియోజకవర్గాలు - సుమారు 20. ఇందులో ఎక్కువగా రాయలసీమ వైపు వున్నాయ్.

10000 నుండి 15000 వోట్లు వచ్చిన నియోజక వర్గాలు - 25 సుమారు.

5000 - 10000 వోట్లు మధ్య సుమారు 30 నియోజకవర్గాలు, ఇవి కూడా రాయలసీమ నుండే అధికంగా వున్నాయ్.(ఈ లిస్టు లో మన చోడవరం కూడా ఉండటం కొంచెం బాధాకరం)

5000 వోట్లు కంటే తక్కువ వున్నవి సుమారు 18 నియోజకవర్గాలు...(రాయలసీమ నుండి అధికం)

ఇక లోకసభ స్థానాలు కి మన పార్టీ అభ్యర్థులకి పడ్డ వోట్లు ఆవరోహణ లో పరిగణిస్తే....

వీ వీ లక్ష్మి నారాయణ (జేడీ)( విశాఖపట్నం) – 288874
డీ ఎమ్ అర్ శేఖర్ (అమలాపురం) – 254848
కొనిదెలా నాగబాబు (నర్సాపురం) – 250289
ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి) – 155807
జ్యోతుల వెoకటేశ్వరరావు (కాకినాడ) – 132648
బోనబోయిన శ్రీనివాసరావు (గుంటూరు) – 129205
బండ్రెడ్డి రామకృష్ణ (మచిలీపట్నం)– 113292

మిగతా వాళ్ళకి 70000 నుండి 100000 మధ్యలో వచ్చాయి.

బి ఎస్పీ, సిపిఐ, సిపిఎం కి ఇచ్చిన ఎంపి సీట్స్ 50000 అంత కంటే తక్కువ వోట్లు సరాసరితో సరిపెట్టుకున్నాయ్.

మొత్తం జనసేన ముఖ్యమంత్రి కొరకు(అసెంబ్లీ సెగ్మoట్స్ లో) సాధించిన వోట్లు - దాదాపు 25 #లక్షలు

మొత్తం జనసేన ప్రధాన మంత్రి కొరకు(లోకసభ సెగ్మoట్స్ లో) సాధించిన వోట్లు - 20 లక్షలు పైనే

మొత్తానికి 20 వేలు నుండి 60 వేలు పై చిలుకు వోట్లు వచ్చిన నియోజకవరర్గాలు సుమారు - 50 నా దృష్టిలో ఈ 50 నియోజకవర్గాల్లో మనం భౌతికంగా ఓడిపోయి ఉండొచ్చు కాని, నైతికంగా గెలిచాం. ఎందుకంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం పోరాడామో మనందరికీ తెలుసు. గ్రామ స్థాయి నుండి నగరాల వరకు రాజకీయ ఉద్దండులుతో ఏ మాత్రం బెదరకుండా, విలువలతో, నిజాయితి గ కొత్త తరహా రాజకీయం చేసి చూపించాం....వాటికి నిదర్శనమే ఈ పాతిక లక్షల ఓట్లు. పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల గెలిపించుకోలేకపోయాం అనే భాద కచ్చితంగా ఉంటుంది....అది కచ్చితంగా ఒక్క జనసేన వాళ్ళకే కాదు, మన రాష్ట్రానికి కూడా తీరని లోటు...ఈ మాట ఎందుకు అన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది.

సమాజంలో అన్ని తరహా ప్రజలు ఉంటారు. జ్ఞానులు, వివేకవంతులు, అజ్ఞానులు, అన్ని తెలిసి కళ్ళు మూసుకుపోయి వున్న వాళ్ళు, ఏమి తెలియని అమాయుకులు, కల్మషం లేని మనసు వున్న వాళ్ళు, ద్వేషంతో విషం కక్కే వాళ్ళు...ఇలా అనంత రకాల మనుషులు ఉంటారు....వాళ్ళందరినీ రాత్రికి రాత్రే మార్చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. నువ్ ఏవి అయితే దృఢంగా నమ్మి ఒకరిని అనుసరిస్తున్నావో, మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ కారణాలు తో వేరే వ్యక్తులకి జై కొట్టడంతో తప్పు లేదు.

మనం విఫలం అవ్వడానికి డబ్బు మద్యం ఉచిత తాయిలాలు, టీడీపీ జనసేన ఒక్కటే అనే అసత్య ప్రచారం, మీడియా ఏడుపులు ఇవన్నీ లెక్కలేసుకుంటే చాలా ఉంటాయ్. కాని మనం అన్నింటికంటే పరిగణించాల్సింది ఒక్కటే.....నమ్మకం....ప్రజలకి మన మీద పూర్తిగా నమ్మకం కలిగించడంలో మనం విఫలం అయ్యాము.

వైసీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు....వీళ్లందరీ కంటే ఎక్కువ మెజారిటీ గ వున్న వాళ్ళు "న్యూట్రల్ ఓటర్లు". వీరిలో డబ్బుకి లొంగిపోయే వాళ్ళు వున్నారు, అలోచించి సరైన వ్యక్తికి వోట్ వేసే వాళ్ళు వున్నారు...కొంచెం ఆలోచిస్తే మన జనసేన ని అనుసరించే వాళ్ళ మైండ్ సెట్స్, న్యూట్రల్ ప్రజలకి దాదాపు పోలి ఉంటుంది....ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయ్. ఎందుకంటే ఆ రెండు పార్టీల్లో ఉండే వ్యక్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎదో ఒక లబ్ది పొందిన, పొందబోతున్న వ్యక్తులు. కాని ఒక్క జనసేన అభిమానులు, తటస్థ ఓటర్లు మాత్రమే ఎవరినుండి ఏమి ఆశించని నిస్వార్ధపరులు....అయితే దురదృష్టం ఏంటి అంటే మన మనస్తత్వాలకి ఎంతో దగ్గరగా ఉన్న సామాన్య ఓటర్లని మనం ఆకట్టుకోలేకపోయాం....కారణాలు ఏవైనా గాని ఈ విషయంలో ఫెయిల్ అయ్యాం....

మనం చేయాల్సింది ఏంటి అంటే....

జగన్ గారిని చంద్రబాబు గారిని విమర్శించడం పక్కన పెట్టి, మన తప్పుల్ని సరి చేసుకుంటే ముందుకు సాగడమే....ఎందుకంటే మనకి పార్టీ ఉంటుందో ఉండదో, మన లీడర్ ఉంటాడో ఉండడో ఆనే సందేహాలు లేవు....ఆయనే అన్నారుగా స్వయంగా తను చనిపోయి నలుగురు కాటికి మోసేంత వరకు జనసేన ఉంటుంది అని....కాబట్టి ధైర్యంగా మనం మన పని చేసుకోవచ్చు గెలుపోటములుకి అతీతంగా.

మరియు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు...ఆయన్ని అప్పుడే విమర్శించడం, ఇంత తొందరిగా ఒక గవర్నమెంట్ ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు..."లెట్ హిమ్ డు హిస్ వర్క్"

ఇక జనసేన మీద పడి ఎడ్చే వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళని అలా వదిలేయండి....వాళ్ళ నాయుకుడి విజయంలో కంటే జనసేన ఓటమిలోనే ఎక్కువ ఆనందం పొందుతున్నారు అంటే మనం వాళ్ళని ఎంత ప్రభావితం చేసామో...ఎంత భయపెట్టామో అర్దం చేసుకోండి....సో వాళ్ళకి జవాబు ఇవ్వకపోవడమే ఉత్తమం.

సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ యూట్యూబ్....మొ. వీటిలో మనం బలంగా ఉండటం ఒక వరమే...కాదు అనను....కాని కేవలం దీనికే పరిమితం అయిపోవడం కూడా ఒక రకంగా శాపం. నేను ఎలక్షన్ రోజున మా గ్రామంలో జనసేన పోలింగ్ ఏజెంట్ గ వున్నాను....గ్రామ స్థాయిలో మన వైపు ఆలోచిద్దాం అని అనుకునే ఓటర్లను నేను కళ్లారా చూసాను...కాని వాళ్ళకి ఎక్కడో ఒక మూల అభద్రత భావం....దాన్ని మనం పోగొట్టాలి. ఒక పక్క సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూనే మీమీ గ్రామానికి ఎప్పుడూ అందుబాటులో వుండండి. మన తల్లి తండ్రుల దగ్గర నుండి మన భందువులు వరకు వీళ్ళతోనే ఎక్కువ సమయం గడపండి. మనకి ముఖ్య సమస్య మెజారిటీ జనసేన సపోర్టర్స్ సొంత వూరికి దూరంగా జాబ్స్ అనో, చదువులు అనో వున్నారు. గ్రామాల్లో ఎక్కువగా జనం డబ్బులు మేసేసే వాళ్ళే రాజకీయం చేస్తున్నారు....వాళ్లకేమో అమాయుకులు అయిన కొంత మంది యువకులు(డబ్బుకు ముందుకు ఆశపడే కొందరు మాత్రమే) బానిసలుగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ తట్టుకుని మనం నిలబడడటం అంత ఈజీ కాదు....అలా అని అంత కష్టమూ కాదు.

పరిణితితో ఆలోచించగలిగే కొంతమంది అవతల పార్టీ మిత్రులకి నా అభ్యర్ధన..... ఇకనైనా చవకబారు విమర్శలు మానేస్తారని ఆశిస్తున్నాం. పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ తీసుకున్నాడు, టీడీపీ తో కలిసిపోయాడు....వగైరా వగైరా.....మానుకుని బాధ్యతగా మాట్లాడతారు అని ఆశిస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించడంలో మీరు 200% విజయవంతం అయ్యారు....ఇకనైనా విలువలతో కూడిన రాజకీయాలు ఆశిస్తున్నాం.

మన ఓటమిని చూసి నిరాశ చెందే జనసైనికులకి నా అంతట నేను రియలైజ్ అయిన విషయం చెప్తా....

ఎక్కువ మందితో ఆమోదం పొందితేనే... ఎక్కువ మందితో రిజెక్ట్ చేయించుకోబడే అవకాశం ఉంటుంది. ఆయన ప్రూవ్ చేసుకుంటే ఓకే (చేసుకుంటారనే ఆశిద్దాం). ఒకవేళ కర్మకాలి మన రాష్ట్ర ప్రతికూల పరిస్థితులకి, వాళ్ళ గత నడవడికి లొంగిపొతే...అదే ప్రజలు తిరస్కరిస్తారు. అప్పుడు ప్రజలు మరల ఈయన వైపు చూస్తారు అని నేను అనుకోవట్లేదు (ఆల్రెడీ చాల సార్లు చూసారు కాబట్టి ఈయన పనితీరు)....అప్పుడు ప్రత్నామ్యాయంగా కనబడేది మనం మాత్రమే....ఈ పాయింట్ అర్ధం చేసుకోండి చాలు.....

కాన్షిరాం గారి గురించి తెలియకపోతే తెలుసుకోండి, గొప్ప గొప్ప వాళ్ళంతా మొదటిసారి విజయం చూడలేదు....ఎన్నో ఏళ్ల కఠోరా శ్రమతో వచ్చాయి...మన నాయుకుడికి పట్టుదలతో పాటు నీతి నిజాయితి కలగలుపుకిని ఇప్పుడు కాకపోయినా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చొరగొంటాడు అని నేను మనసా వాచా కర్మణా విశ్వసిస్తున్నాను.

రానున్న రోజుల్లో మరింత నమ్మకంతో, మంచి ప్రణాళికలతో మన ఉద్యోగాలు, మన చదువులు, మన కుటుంభాలు తో పాటు మనం నమ్మిన జనసేన కోసం కొంత సమయం నిస్వార్ధంగా కేటాయించాలని కోరుకుంటూ...

ఒక జనసైనికుడు సాయి నాథ్

Tags : Pawan Kalyan, Janasena Party, Jana Sainikudu

Write a comment ...
Post comment
Cancel