back

సైరా కోసం జేమ్స్ బాండ్ ఫైటర్Share via:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిస్తాత్మకంగా తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' హైదరాబాద్ శివార్ల లోని ఒక పాత కోటలో చిత్రికరన జరుపుకుంటుంది.

ఈ చిత్రం కోసం ఇప్పటికే ఎంతో మంది అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో ప్రముఖ ఫైట్ మాస్టర్ గ్రెగ్ పొవెల్ చేరారు.

గ్రెగ్ పొవెల్ జేమ్స్ బాండ్ సినిమా అయిన 'స్కై ఫాల్' చిత్రానికి ఫైట్ మాస్టర్ గా పనిచేసారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో... బ్రిటిషర్ల నుండి పోరాడి తుపాకులని తెచ్చుకునే ఒక ఫైట్ సీన్ ని దర్శకుడు సురెందెర్ రెడ్డి అద్బుతంగా రాసుకున్నారని... దానికోసమే గ్రెగ్ ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.

ఎంతోమంది జాతీయ ప్రముఖ నటులతో పాటు మెగా ఫ్యామిలి వారు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి నటుల జాబితాని ఇక్కడ చుడండి...

సైరా ఎప్పుడు విడుదల కానుందో తెలుసా...

Tags : Greg Powell For Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel