back

జగదేక వీరుడు అతిలోక సుందరికి 28 ఏళ్ళుShare via:

జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 మే 9 వ తేదిన కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బానర్ పైన అశ్వినిదత్ నిర్మించాడు. ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.

ట్రెండింగ్: పవన్ కళ్యాణ్ ఫాన్స్ పైన పడిన రాంగోపాల్ వర్మ

వరుస అపజాయాలో ఉన్న రాఘవేంద్రరావు తో చిరంజీవి, శ్రీదేవి జంటగా ఇంత భారీ బడ్జెట్ సినిమా తీసిన అశ్వినీదత్ ధైర్యానికి జోహార్లు చెప్పాలి. ప్రకృతి వైపరిత్యంలో రాష్ట్రంలో ముఖ్య భాగం వరదలలో ఉండగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్ ని బద్దలుకొట్టి చరిత్రని తిరగ రాసింది. ఈ సినిమా కి చిరంజీవి శ్రిదేవి జంట అద్భుతంగా కుదరడం , కథ, సెట్స్, పాటలు, నటీనటుల అభినయనం అన్ని కలిసి ఈ సినిమాను సూపర్ దుపెర్ హిట్ చేసాయి.ఇందులో బాలతారలు అయిన ‘శాలిని’ సఖి సినిమా ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, ‘శామిలి’ ఓయ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.

చాల థియేటర్లు లో 100 రోజులు ఆడిన ఈ సినిమా ఒక థియేటర్ లో 200 రోజులు పూర్తి చేసింది. 10 కోట్ల కలెక్షన్స్ తో సిన రికార్డు బుక్స్ ని తిరగరాసిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి.

కథ :

ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) అరకు లో ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది. రాజు వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకొన్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది. మహాదృష్ట (అమ్రిష్ పురి) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో చిత్రం సుఖాంతమౌతుంది.

>సంగీతం :

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు మరియు నేపథ్య సంగీతం సంగీత ప్రియులను అప్పట్లో ఒక ఊపు ఉప్పేసింది. అబ్బనీ తీయని దెబ్బ పాత అయితే ఇప్పటికీ అల్ టైం హిట్ సాంగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

  • మన భారతంలో - అరకు అందాలను వివరిస్తూ సాగే పాట
  • అందాలలో అహో మహోదయం - మానసరోవరం ని వర్ణించే పాట
  • జై చిరంజీవా! జగదేకవీరా! - ఆంజనేయ స్వామి స్పురిస్తు సాగే పాట
  • యమహో నీ యమా యమా అందం - ఒక యుగాల గీతం
  • అబ్బనీ తీయనీ దెబ్బ - ఒక తరాన్ని ఊపెసిన పాట
  • ప్రియతమా, నను పలకరించు ప్రణయమా - ఇళయరాజా కె సాధ్యమైన మెలోడీ సాంగ్
  • ధినక్కుతా కసక్కురో - మాస్ బీట్

ఈ సినిమా చూడాలనుకునే వారు క్రింద వీడియో చూడండి ..

Tags : Jagadeka Veerudu Athiloka Sundari, MegaStar Chiranjeevi, Sridevi, Raghavendra Rao, Ashwini Dutt

Write a comment ...
Post comment
Cancel