back

మెగా ఫ్యామిలీతో కొరటాల శివ లాక్ అయ్యాడా..Share via:

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’... అనే సినిమా పేర్లు చూడగానే మనకు గుర్తొచ్చే పేరు కొరటాల శివ. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు నాలుగంటే నాలుగే. కానీ, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడంలో తనది అందె వేసిన చేయి అని ఆయన నిరూపించుకున్నారు.

కొరటాల తీసిన ప్రతి సినిమా, ఆ సినిమాలో నటించిన హీరోలను మరో ఎత్తు పైకి తీసికేల్లింది. మరి అటువంటి శివ ఇప్పుడు ఏకంగా నట శిఖరాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా సినిమా నిర్మించనుండగా ఆ సినిమాకి టైటిల్ గా ‘రైతు’, చిరు కి జోడిగా హింది హీరోయిన్ ‘హ్యుమా ఖురేషి’ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం చరణ్ కొరటాలకు రెండు సినిమాల కోసం అడ్వాన్సు ఇచ్చాడట.  చిరంజీవి - కొరటాల సినిమాకు చరణ్ కూడా ఒక నిర్మాత. ఈ సినిమా కాకుండా తన నెక్స్ట్ ఫిలిం కొరటాల శివ డైరెక్షన్లో చేస్తాడట.

RRR సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్ - కొరటాల కాంబో సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ కాంబో పై ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి, మిర్చి రిలీజ్ అవ్వగానే ఒకసారి సినిమా లాంచ్ అయ్యి కూడా ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఉంటుందట.

ఈ లెక్కన కొరటాలతో సినిమా చెయ్యాలని చూస్తున్న వేరే హీరోలు దాదాపు రెండేళ్ళ పాటు తమ ఆలోచనను పక్కనబెట్టాల్సిందే.

Tags : Koratala Siva, Mega Family, Megastar Chiranjeevi, Mega Power Star, Ram Charan

Write a comment ...
Post comment
Cancel