back

RRRకి హీరోయిన్స్ దోరికేసారా ..?



Share via:

రామారావు-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR ఈ నెల 11న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరిశ్రమ దిగ్గజాల నడుమ భారీ సెట్స్ లో సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్స్లో ఈనెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది టీమ్. ఆరంభమే ఈ సెట్స్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. బాహుబలిని మించి.. 300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాకి నటీమణులు ఫైనల్ అయ్యారా అంటే నో ఆన్సర్ ....

ఇండస్ట్రీ వర్గాల మాటలని బట్టి రాజమౌళి ఒక నలుగురు నటిమనులను సెలెక్ట్ చేసారని అందులో ఇద్దరిని ఫైనల్ చేయాల్సిందిగా చెప్తున్నారు. వారెవారంటే రాశి ఖన్నా, పూజ హెగ్డే, కైరా అద్వాని మరియు కీర్తి సురేష్. అందులోనూ దక్షినాది అంతా ‘సావిత్రి’ సినిమాతో పాపులర్ అయిన ‘కీర్తి సురేష్’ , ధోని సినిమాతో హిందీ లో ఆరంగేట్రం చేసిన కైరా అద్వానీ వైపే మొగ్గు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి యాక్షన్ షెడ్యూల్ పూర్తి అయిన తరువాతే దీని మీద క్లారిటీ వచ్చే అవకాసం ఉంది

Tags : RRR, Ram Charan, Jr NTR

Write a comment ...
Post comment
Cancel